Trinayani November 21 2023 Episode 1090: స్వామీజీ మా విన్నపం మన్నించి మీరే స్వయం పాకాన్ని అందుకోండి అని విశాల్ అంటాడు. అలాగే అని స్వామీజీ స్వయం పాకాన్ని అందుకుంటాడు. గురువుగారు బరువుగా ఉంది మోయలేరేమో, పవన్ మూర్తి పట్టుకోవాలని తిలోత్తమా నెట్టేస్తుంది. పావన మూర్తి స్వామీజీకి తగిలి అవన్నీ కింద పడిపోయి గుమ్మడికాయ పగిలిపోతుంది. అయ్యో గుమ్మడికాయ కుళ్లిపోయింది అంటే గండం పోలేదనే కదా అని తిలోత్తమ అంటుంది.గండం పోలేదని ఇంకా అనుకోవాల్సిందేనా గాయత్రి అమ్మకు ఆపద ఉన్నట్టేనా అని నైని అంటుంది. కంగారు పడకు నైని ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం అని స్వామీజీ అంటాడు. గురువుగారిని పంపించేసి వస్తాను అని విశాల్ వెళ్లిపోతాడు. పూజ పూర్తయిందని విశాల్ బాగానే పక్కన నిలబడి స్వయంపాకం అందించాను అని సుమన అంటుంది.

నువ్వు అన్నిటికి పేడదాలే తీస్తావా అని పావన మూర్తి అంటాడు. కట్ చేస్తే,ఏం చేస్తున్నావు నైని అని విశాల్ అడుగుతాడు. గాయత్రి గారి జాతకాన్ని రాస్తున్నాను అని నైని అంటుంది. మీ తాత లాగా నువ్వు కూడా జాతకాలు రాస్తున్నావా అని విశాల్ అంటాడు. చిత్రగుప్తుడి పూజ చేసిన తర్వాత స్వయంపాకంలో గుమ్మడికాయ కింద పడిపోతే అభిషేకం అనిపిస్తుంది అని అంటుంది. నైని గుమ్మడికాయ కింద పడి పగిలిన వాసన రాలేదు అంటే అది కారాబు కాలేదు ఎవరో కావాలని చేసిన పని అని విశాల్ అంటాడు. సుమన చేసి ఉంటుంది అని నైని అంటుంది. ఎవరు చేస్తే ఏముందిలే నైని అనుకోకుండా జరిగిపోయిన దానికి చేసేదేమీ లేదు అని విశాల్ అంటాడు. మీరు ధైర్యంగా ఉంటే నేను మీ వెనకాల నడిచి నా మొదటి కూతురు ఎక్కడ ఉందో తెలుసుకుంటాను అని నైని అంటుంది.

కట్ చేస్తే, విక్రాంత్ నైని తెచ్చిన పెట్టెను చూసి ఇందులో ఐదు గవ్వలు ఉన్నాయి వీటితో ఏం చేస్తారు అని అంటాడు. విశాల్ బాబు ఆ గవ్వలు కింద పడితే నేను కనబడను అని పెద్ద బొట్టమ్మ అంటుంది. బాబు ఆ గవ్వలు నీ చేతిలో ఉండడంతో నీకు కనపడుతున్నాను. ముందు ముందు నీకే తెలుస్తుంది నాకు ఒక చిన్న సహాయం చేస్తావా బాబు ఈరోజు నాగుల చవితి ఉలవచిని తీసుకొచ్చి ఇస్తే పాలు పోసి తీసుకువస్తాను అని పెద్ద బోట్టమ్మ అంటుంది. అలాగే తీసుకు వస్తాను సుమన కళ్ళు కప్పి ఎలా తీసుకు రావడం అని విక్రాంత్ అంటాడు. నేను వెళ్లి సుమన కళ్ళు కప్పుతాను మీరు వెళ్లి తీసుకురండి బాబు అని పెద్ద బొట్టమ్మ అంటుంది. కట్ చేస్తే,ఆస్తిక అని పేరు ఇల్లంతా రాస్తుంది అని సుమన అంటుంది. ఏమి రాస్తున్నావు చిట్టి నాకు ఏమీ అర్థం కావట్లేదు అని హాసిని అంటుంది. నాకు అర్థమైంది మమ్మీ వాలి వాలి అని రాసుకుంటూ వెళ్తుంది అని వల్లభ అంటాడు. అంటే నాకు ఆస్తి కావాలి అని రాస్తుంది అని విక్రాంత్ అంటాడు.

అది కాదు విక్రాంత్ బాబు ఈరోజు నాగుల చవితి కదా ఉలవచిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదని రాస్తుంది అని నైని అంటుంది. ఈ విషయం నీకెలా తెలుసు అక్క అని సుమన అంటుంది. మహాభారతం చదివితే ఎవరికైనా అర్థమవుతుంది అని నైని అంటుంది. ఈ ఘట్టం నేను ఎప్పుడు వినలేదే అని వల్లభ అంటాడు. ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అసలు దాని అర్థం ఏంటి వదిన అని విక్రాంత్ అంటాడు. అభిమన్యుడు చనిపోయినప్పుడు ఉత్తర గర్భవతిగా ఉంటుంది ఆ తరువాత పరీక్షిత్ మహారాజు పుడతాడు ఆయన ఒక కారణం వల్ల పాము కాటుకు బలి అయ్యి మరణిస్తాడు అది విన్న జనమేజయుడు చంపేస్తానని యాగం చేస్తాడు అప్పుడు సర్పాలకు మేనల్లుడు అయిన ఆస్తికుడు వచ్చి ఆ యాగాన్ని ఆపేసి సర్ప జాతిని అంతటినీ కాపాడుతాడు అందుకే నాగుల చవితి రోజు ప్రతి ఇంటి ముందు ఆస్తిక అని రాసుకుంటారు అని నైని చెబుతుంది.

అయితే ఇప్పుడు చిన్న మరదలు ఎవరినీ కాపాడడానికి రాస్తుంది అని వల్లభ అంటాడు. ఉలోచిని పెద్ద బొట్టమ్మా నుంచి కాపాడుకోవడానికి అని విక్రాంత్ నోరు జారుతాడు. మీకెలా తెలుసు అని సుమన అంటుంది. గెస్ చేశాను అని విక్రాంత్ అంటాడు. అందరూ తెలివి మీరిపోయారు కానీ ఈరోజు పెద్ద బొట్టామ్మని నా కూతురిని తాకనివ్వను అని సుమన అంటుంది. ఇంతలో పెద్ద బోట్టమ్మ వచ్చి సుమన కాళ్ళకి చేతులకి ఒళ్ళంతా దారం చుట్టేస్తుంది. అక్క ఇది ఎవరు కడుతున్నారు చూడు అని సుమన అంటుంది. నాకు నిజంగా తెలియదు చెల్లి అని నైని అంటుంది. ముందు ఉలొచి గదిలో ఉందో లేదో చూడండి అని వల్లభ అంటాడు.

అందరూ పరిగెత్తుకొచ్చి చూస్తారు. ఈ లోపే పెద్ద బోట్టమ్మ వచ్చి ఉలోచిని ఎత్తుకొని వెళ్తూ ఉంటుంది. సుమననని అలా ఎందుకు బంధించావు పెద్ద బోట్టమ్మ అని విక్రాంత్ అంటాడు. తన పిల్లల జోలికి వస్తే కోడి సైతం తిరగబడుతుంది ఉలోచిని తీసుకు వెళ్ళేటప్పుడు సుమన అలా చేయకూడదు అని కట్టేశాను విక్రాంత్ బాబు అని పెద్ద బోట్టమ్మ అంటుంది. అంటే సుమన కూడా తిరగబడుతుందనా నీ ఉద్దేశం అని విక్రాంత్ అంటాడు.