World Television Day 2023: మన దైనందిక జీవితం లో టెలివిషన్ పాత్ర ఎంతో ముఖ్యమైనది. టీవీ మీద మనం ఎంతగా ఆధారపడుతున్నామో మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. టెలివిషన్ లేని ఇల్లుని ఊహించడం కష్టం. టెలివిజన్ ప్రపంచవ్యాప్తంగా గృహాలలో ఒక విలాసవంతంమైన వస్తువుగా కాక ఒక వసరమైన పరికరంగా తయారైంది. ప్రపంచ టెలివిజన్ల మార్కెట్ ఆదాయం 2022 లో సుమారు 94 బిలియన్ అమెరికన్ డాలర్లు.

1996 వ సంవత్సరం లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ టెలివిజన్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాచుర్యానికి గుర్తుగా నవంబర్ 21 వ తేదీని ప్రపంచ టెలివిజన్ దినోత్సవం గా జరుపుకోవాలని నిర్ణయించింది. అప్పటినుండి 27 ఏళ్లుగా ప్రతీ సంవత్సరం నవంబర్ 21 న ప్రపంచ టెలివిజన్ దినోత్సవం గా జరుపు కుంటారు. ఈ రోజున చాలా TV అమ్మకాల పై తగ్గింపులు కూడా ఇస్తున్నారు. మ న జీవితాల్లో టెలివిజన్ వినోదాన్ని, విజ్ఞానాన్ని , వార్తలను, సినిమాలను, ఆటలను చూసే అవకాశాన్ని మనకిస్తోంది. ఈ సంవత్సరం థీమ్ టెలివిజన్ అందుబాటు . సమాజంపై టెలివిజన్ యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యత మరియు ప్రభావాన్ని గుర్తించడానికి ఈ రోజును ఒక ముఖ్య దినంగా ప్రపంచమంతా జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి సేకరించిన గణాంకాల ప్రకారం, 2023 లో టెలివిజన్ ఉన్న కుటుంబాల సంఖ్య దాదాపు 1.73 బిలియన్లుగా ఉంది.
టెలివిజన్ కనిపెట్టిన రోజు నుండి ఎన్నో మార్పులను చెంది న తర్వాత ఇవాళ మనం చూస్తున్న టేలివిషన్ వచ్చింది. కానీ ఇది ఇవాళ్టి యుగంలో కూడా తన ఉనికిని ఉపయోగాన్ని కాపాడుకుంటోంది . కేబుల్ టీవీ లనుండి, ఇవాళ ఇంటర్నెట్ నుండి నేరుగా సిగ్నల్ ను తీసుకొని ప్రసారం చేసే విధంగా మారింది. ఇది ఎవరూ ఊహించని పరిణామం. మనకు, నెట్ ఫ్లిక్, అమెజాన్ , డిస్నీ లాంటి ఎన్నో ప్లాట్ఫారం ల ద్వారా ప్రపంచం లోని అన్ని రకాల వార్తలు, వినోదాలు, ప్రత్యక్షముగా చూసే వీలు అయింది. ప్రేక్షకుల వీక్షించే కార్యక్రమాలు, వారి అభిరుచులకు తగినట్లుగా TV ఈ రోజున ఇవ్వగలుగు తోంది. వార్తలు, సమాచార సమర్పణలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. మారుతున్న వీక్షకుల జీవనశైలికి అనుగుణంగా టెలివిజన్ అందంగా మారిపోయింది ఎన్నో ఏళ్ళ నుండి ఒక నమ్మకమైన వస్తువుగా అందుబాటులో ఉంటోంటి.
World Television Day: టెలివిజన్ పుట్టిన రోజు…అంతర్జాతీయ టీవీ రోజు ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా?
టెలివిషన్ దినోత్సవం జరుపుకోవడం వలన ప్రసార మాధ్యమాల ఆవశ్యకతను, వాటి ముఖ్య పాత్రను ప్రపంచ మంతా ఈ దినోత్సవం నాడు గుర్తిస్తోంది. రచయితలు, పాత్రికేయులు, బ్లాగర్లు మరియు ఈ మాధ్యమంతో సంబంధం ఉన్న ఇతరులు ఇవాళ ఒక పండుగలా జరుపుకోడానికి కి కలిసి వస్తారు. కొత్త కొత్త టెక్నాలజీ లు ఎన్ని వస్తున్నా , అవి పాత టెక్నాలజీ ల తో అనుసంధానించబడి వాటి ఉనికికి విలువను పెంచుతున్నాయి. కొత్త కొత్త మార్పుల వలన టీవీలు ముఖ్యమైన సమస్యల గురించి అవగాహన పెంచడానికి, పరిష్కారాలను కనుగొనేందుకు కూడా గొప్ప అవకాశాన్ని కలుగ చేస్తున్నాయి.
సామాజిక మాధ్యమాల్లో వచ్చే విషయాలు, వార్తలు ఎంతవరకు నమ్మదగినవి అని వీక్షకులకు సందేహం రాకుండా ఉండాలంటే నిష్పక్షపాతంగా వార్తలను, సమాచారాన్ని అందించవలసి ఉంటుంది. ఆ దిశగా పనిచేయ డానికి ప్రభుత్వాలు, వార్తా సంస్థలు మరియు వ్యక్తులు కట్టుబడి ఉండాలని కూడా ఈ ప్రపంచ టెలివిజన్ దినోత్సవం గుర్తు చేస్తుంది.
తెలుగు లో వచ్చిన టాప్ 5 వెబ్ సిరీస్ గురించి తెలుసు కోవాలని ఉందా ఐతే చూడండి వాటి గురించి విశేషాలు.
1. దయా
కాకినాడ హార్బర్ లో ఫ్రీజర్ వన్ డ్రైవర్ దయా. అతని భార్య అలివేలు గర్భిణీ . తనను హాస్పిటల్ కి తీసుకెళ్లామని చెప్పినా వినకుండా ఎదో పని మీద వెళ్తాడు దయా. పని తర్వాత ఫ్రీజర్ లో శవము చూసి అవాక్కవుతాడు. ఎవరిదా శవము. ఫ్రీజర్ లోకేలా వచ్చింది? జర్నలిస్ట్ కవిత హైదరాబాద్ నుండి కాకినాడకు ఎందుకొచ్చింది? ఇవన్నీ ఈ కధలో ని ముఖ్య అంశాలు. జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో పవన్ సాధినేని తీసిన వెబ్ సిరీస్ ఇది. ఇందులో రమ్య, విష్ణుప్రియ కూడా ఉన్నారు. ఇది డిస్నీ హాట్ స్టార్ లో వచ్చింది. ఇది డిజిటల్ ప్లాట్ఫారం లో జేడీ చక్రవర్తి చేసిన మొదటి వెబ్ సిరీస్.

2. ఏ టీ ఎం
నలుగురు స్నేహితులు చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటారు. ఒక రోజున ఒక కారును దొంగిలిస్తారు. అందులో వజ్రాలు ఉండడం తో వారి జీవితాలు ఊహించని మలుపు తిరుగుతాయి. ఈ సిరీస్ లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉనాయి. ఇది ఒక ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్. సుబ్బరాజు ముఖ్య పాత్ర లో నటించిన ఈ సిరీస్ లో మురికివాడలలో జీవితం, అక్కడ నివసించే వారి జీవితాలు చూపించారు. ఇది ఒక క్రైమ్ డ్రామా సిరీస్, ఇది ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 లో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ కు సి.చంద్ర మోహన్ దర్శకత్వం చేశారు. హరీష్ శంకర్ రచయిత.

3. డెడ్ పిక్సెల్స్
ఆన్ లైన్ గేమ్ లమీద బాగా ఇష్టమున్న ముగ్గురు ఫ్రెండ్స్ జీవితాల చుట్టూ అల్లిన కద ఇది. ఆన్ లైన్స్ అంటే మక్కువ ఎక్కువ ఉన్న వారికి నచ్చే అంశం తో కూడిన ఈ సిరీస్ కొంత వరకు ఆసక్తిగా, వినోదంగా , బాగానే ఉంటుంది. ఇది ఎక్కువ మందికి ఎక్కదు . కొనెడల నీహారిక నటించిన వెబ్ సిరీస్ . ఆదిత్య మండల దర్శకత్వం చేసిన ఈ వెబ్ సిరీస్ ఇదే పేరున్న బ్రిటిష్ టెలివిజన్ సిరీస్ ని ఆధారం గా చేసుకుని తీశారు. ఇది డిస్నీ హాట్ స్టార్ లో వచ్చింది

4. వ్యవస్థ
అవినాష్ చక్రవర్తి తాను వాదించే కేసును గెలవడానికి ఏమైనా చేయడానికి వెనుకాడని ఒక క్రూరమైన న్యాయవాది. అతని అహంకారాన్ని వంశీకృష్ణ అనే ఒక కుర్ర లాయర్ సవాలు చేస్తాడు. వంశి కృష్ణ అవినాష్ యొక్క యజమాని కుమారుడు. అదీగాక కొత్తగా పట్టభద్రుడైన న్యాయవాది. తర్వాత అవినాష్ ఏం చేస్తాడు? అనేది వెబ్ సిరీస్ యొక్క మూల కదాంశం. ఇది ఒక లీగల్ డ్రామా. బలమైన కథాంశం ఉన్నప్పటికీ పేలవమైన కధనం తో విసుగొస్తుంది. అయినప్పటికీ, కొంత టైం పాస్ కి చూడచ్చు. హేభ పటేల్, కామ్నా జఠ్మలానీ ఉన్నారు ఇందులో. సంపత్ నంది నటన బావుంది. ఇది జీ 5 లో వచ్చింది.

5. బాడ్ ట్రిప్
నలుగురు అపరిచితులు ఒక టాక్సీ లో కలిసి వెళ్తుంటారు. ఆ రాత్రి వారి జీవితాలను మార్చే దురదృష్టకరమైన రాత్రి. జీవితంలో ధనవంతులుగా ఒక్క సారైనా మారే అవకాశం వారికి లాభం కన్నా ఇబ్బందులనే తెస్తుంది . ఒక శవం, దొంగిలించిన కారు, కిడ్నాప్, బోలెడంత డబ్బు వారిని ‘బ్యాడ్ ట్రిప్’కు తీసుకెళ్తాయి. పర్వాలేదపించే స్టోరీ. సోనీ లివ్ లో వచ్చింది.
వీటిలో మీకు నచ్చిన సిరీస్ చూడండిక.