Trinayani October 6 ఎపిసోడ్ 1051: విశాల్ ని ఎత్తుకొని వచ్చి అమ్మవారి గుడి ముందు పడుకోబెట్టి అమ్మని పూజిస్తుంది నైని పూజించి నా భర్తని బ్రతికించు అని అంటుంది. అమ్మ అమ్మవారు కరుణించి విశాల్ ని బ్రతికిస్తుందంటావా అని వల్లభ అంటాడు. ఎందుకురా తొందర చూద్దాం అని తిలోత్తమా అంటుంది. చెల్లి అమ్మవారు కరుణించలేదు విశాల్ లేవలేదు అని హాసిని అంటుంది.అక్క ఇంకా విశాల్ బావ కళ్ళు తెరవలేదు అని సుమన అంటుంది. వదిన ఇప్పటికే లేట్ అయింది హాస్పిటల్ కి తీసుకెళ్దామా అని విక్రాంత్ అంటాడు.అందరమూ ఇలా మాట్లాడుతుంటే పెద్ద మరదలు అలాగే అమ్మవారుని అంతల చూస్తుంది ఏంటి అని వల్లభ అంటాడు. నువ్వు అమ్మవారి వంక అలా చూస్తూ ఉంటే ఇంకా సేపట్లో వెచ్చని మంటలే విశాల్ కి తగులుతాయి కాని విశాల్ మాత్రం మనకు మిగలడు ఆని తిలోత్తమా అంటుంది. అమ్మ మీరు కాసేపు నోరు ముయ్యండి అమ్మ అని విక్రాంత్ అంటాడు.

ఆ విషయం డాక్టర్లు చూసి కూడా చెప్తారు మా అక్క మొగుడు చనిపోయాడని అని సుమన అంటుంది. ఒసేయ్ నువ్వు ముందు నోరు ముయ్యవే అని విక్రత్ అని తిడతాడు. అమ్మ అందరూ నా భర్త చనిపోయాడు ఇక బ్రతకడు నా పసుపు కుంకుమ తుడిచేసుకోవాల్సిందే నువ్వు వెదవ గా ఉండాల్సిందే అని అందరూ అంటున్నా నేను ఎందుకు మాట్లాడకుండా నిలబడిపోయాను నీకు తెలుసా ఒక్క నిమిషం నా భర్తను బ్రతికించు ఆయన కళ్ళు తెరవగానే ఆయన కళ్ళ ముందే నేను త్రిశూల్లాన్ని పొడుచుకొని సుమంగళిగా చనిపోతాను ఆ తర్వాత నా బిడ్డలను కూడా బలి తీసుకో అని నైని త్రిశూలం తీసుకొని పొడుచుకోబోతోంది. ఇంతలో గాయత్రి వచ్చి కాళ్లు పట్టుకుంటుంది.

గాయత్రి ని చూసిన నైని ఆగిపోతుంది. చెల్లి విశాల్ కి స్పృహ వచ్చింది అని హాసిని అంటుంది. బాబు గారు మీకేం కాలేదు కదా అని నైని అంటుంది. గాయత్రి ఎలా ఉంది నైని అని విశాల్ అంటాడు. తనను కాపాడబోయే మీరు చావు అంచుల దాకా వెళ్లి వచ్చారు అని నైని అంటుంది.దత్తత తీసుకున్న కూతురు అయిన అమ్మానాన్నలు చావకుండా కాపాడింది అని హాసిని అంటుంది.

అవును బంగారం ఐ లవ్ యు టూ గాయత్రి అని విక్రాంత్ అంటాడు. అందరూ కలిసి ఇంటికి వెళ్తారు.కట్ చేస్తే బాబు గారు ఇప్పుడు ఎలా ఉన్నారు అని నైని అంటుంది. నేను బాగానే ఉన్నాను కానీ నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు అని విశాల్ అంటాడు.నేనెలా ఉన్నాను తెలుసుకోవాలని రాలేదు మీకు ఆరోగ్యం కుదుటపడ్డాక అమ్మవారి బొట్టు పెడదామని వచ్చాను అని నైని బొట్టు విశాల్ కి పెడుతుంది అవును బాబు గారు గానవికి ఏదైనా ప్రమాదం జరిగితే మన కూతురు కాబట్టి నాకు తెలియదు కానీ గాయత్రీ కి ప్రమాదం జరిగితే నాకు ముందే తెలుస్తుందిగా కానీ ఎందుకు తెలియలేదు అని నైని అంటుంది.

ధర్మసందేహమైతే చెప్పొచ్చు కాని కర్మ సందేహాన్ని ఊహించలేం కదా అని విశాల్ అంటాడు. నాకు అర్థమైంది మీకు నిద్ర వస్తుందని గాయత్రిని ఎత్తుకొని వెళ్ళిపోతుంది నైని. కట్ చేస్తే అమ్మ మగవాళ్లు పొగ తాగేటప్పుడు ఆడవాళ్లు సెగదాగేటప్పుడు మంచి ఆలోచనలు వస్తాయని అంటారు అది నిజమేనా అని వల్లభ అంటాడు. అది మంచి బుర్ర ఉంటే వస్తాయి అంతేకానీ బుర్రలో మట్టి ఉంటే ఎలా వస్తాయి అని తిలోత్తమా అంటుంది. అదేంటి మమ్మీ అలా అంటావు అని వల్లభ అంటాడు.మరేంట్రా పొద్దున్నే తాగువచ్చిన వాడిలా మాట్లాడుతున్నావు అని తిలోత్తమా అంటుంది. అమ్మ నైని ని దెబ్బతీయాలని మనం ఎన్నిసార్లు ప్లాన్లు వేసిన అవి పనిచేయట్లేదు ఇంకా ఏం చేద్దాం అని వల్లభ అంటాడు. ఒరేయ్ మనం గదిలో లేము హాల్లో ఉన్నాం వెనుక ముందు చూసుకొని మాట్లాడు అని తిలోత్తమా అంటుంది. చూసుకో లేదమ్మా అని వల్లభ అంటాడు.

చూసుకోవడానికి ఏముందని వెనక ముందు ఆస్తులు ఏమైనా ఉన్నాయా చల్లగా ఉందా హాయిగా ఉందా అని హాసిని నీళ్లు చల్లుతుంది. చిరాగ్గా ఉంది అక్క ఎందుకు చలుతున్నావ్ అని సుమన అంటుంది. అమ్మొస్తుంది కదా అని హాసిని అంటుంది. అమ్మ ఏ అమ్మ జోగులాంబ నాగులమ్మ రేణుకమ్మ అని సుమన అంటుంది. కాదు విశాలాక్షమ్మ అని హాసిని అంటుంది. ఓ ఆ గారడీ పిల్ల అని సుమన అంటుంది. ఏ పిల్ల అంటావేంటే అమ్మ అను అని విక్రాంత్ అంటాడు. ఇంతలో దమ్మక్క వచ్చి అమ్మ వచ్చేసింది అని అంటుంది. విశాలాక్షి రాగానే అందరూ షాక్ తో నిలబడి ఏంటి పిల్ల ముత్తైదులో ఉండే దానివి ఇప్పుడు పెద్ద ముత్తైదులా వచ్చావు అని విక్రాంత్ అంటాడు.

వయసుకు వచ్చిన పిల్ల చీర కడితే అమ్మలాగే ఉన్నావు అని హాసిని అంటుంది. అది సరే పెళ్లయిందా అని తిలోత్తమా అంటుంది. చిన్నపిల్ల అత్తయ్య పెళ్లి ఎలా అవుతుంది అని నైని అంటుంది. బాల్య వివాహం చట్టరీత్య నేరం కూడా అని విశాల్ అంటాడు. మరి అవతారమేంటి అలా అని తిలోత్తమా అంటుంది. అవును మెడలో నల్లపూసలు కూడా ఉన్నాయి ఏంటి అని విక్రాంత్ అంటాడు. అష్టమి చంద్రుడు వచ్చాడు కదా చిన్నన్నా రేపటి నుంచి నవరాత్రులు మొదలవుతాయి అందుకే ఇలా వచ్చాను అని విశాలాక్షి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది