Spy Arrested External Affairs Department: విదేశాంగ శాఖలో మరో గూఢచర్యం కేసు వెలుగు చూసింది. కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్న నవీన్ పాల్ అనే వ్యక్తిని గూఢచర్యానికి పాల్పడినట్లుగా ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) గుర్తించింది. ఐబీ సమాచారంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు నవీన్ పాల్ ను అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో పరిచయమైన యువతితో నవీన్ పాల్ ఛాటింగ్ చేసినట్లుగా ఐబీ అధికారులు గుర్తించారు. దేశ ఇంటెలిజెన్స్ సమాచారం, విదేశాంగ శాఖ కీలక పత్రాలతో పాటు జీ – 20 భేటీ వివరాలను కరాచీ యువతికి నవీన్ పంపినట్లు సమాచారం. సదరు యువతి అకౌంట్ నుండి నవీన్ ఖాతాకు భారీగా నగదు బదిలీ జరిగినట్లు గుర్తించారు. దీంతో నవీన్ పాల్ ను అదుపులోకి పోలీసులు, ఐబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.