Nellore APGENCO Fire Accident: జెన్ కో విద్యుత్ కర్మాగారంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఉద్యోగులు పరుగులు తీశారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని దామోదరం సంజీవయ్య జెన్ కో విద్యుత్ కర్మాగారంలో జరిగింది. ఆదానీ కృష్ణపట్నం పోర్టు నుండి జెన్ కో రెండు యూనిట్ బాయిలర్ వద్దకు బొగ్గు సరఫరా చేసే కన్ వేయర్ బెల్ట్ పైన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో ఆందోళనకు గురైన కార్మికులు, ఉద్యోగులు అక్కడ నుండి పరుగు లంకించుకున్నారు. సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.