రెడ్ వైన్ తాగడం వల్ల మనకు ఆరోగ్యంతో పాటు.. చర్మ సౌందర్యం కూడా సొంతమౌతుందని నిపుణులు చెబుతున్నారు. రెడ్ వైన్ వల్ల దంత వ్యాధులు, బరువు తగ్గించుకోవడం, మతిమరుపును నుండి ఉపశమనం పొందడం తో పాటు కొన్ని రకాల క్యాన్సర్ ల నుండి రక్షణ పొందడానికి రెడ్ వైన్ గ్రేట్ గా సహాయపడుతుంది.
రెడ్వైన్లోని ప్రత్యేక గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచి వృద్ధ్యాప్య ఛాయలను దూరం చేస్తాయి. రెడ్ వైన్ లో ఉన్న రెస్వెట్రాల్ ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తుంది. రక్తంలో ఇన్సులిన్ నిరోధకత, వల్ల టైప్ 2డయాబెటిస్ ప్రధాన కారకంగా చెప్పవచ్చు. అందుచేత రెడ్ వైన్ టైప్ 2 డయాబెటిస్ నిరోధించడానికి సహాయపడుతుంది. రెడ్‌వైన్ తీసుకోవడం వలన మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందనీ, ఇది గుండెను ఆరోగ్యంగా వుంచుతుందని, పరిశోధనలో తేలింది.వైన్ మొటిమలను నివారించడానికి బాగా సహాయపడుతుంది . మితంగా తీసుకొనే రెడ్ వైన్ వల్ల లంగ్ క్యాన్సర్ రిస్క్ ఉండదు. మరియు లంగ్స్ ఆరోగ్యంగా పనిచేయడానికి సహాయపడుతుంది.
మెదడులో కణాలు డ్యామేజ్ ను అరికట్టడానికి రెడ్ వైన్ బాగా సహాయపడుతుందని కొన్ని పరిశోధన ద్వారా వెల్లడి చేయడం జరిగింది . బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ ను నివారిస్తుంది . దాంతో అల్జీమర్స్ ను కూడా దూరం చేస్తుంది.మెరిసేటి మరియు క్లియర్ స్కిన్ సహజంగా పొందడానికి, రెడ్ వైన్ తో ప్రతి రోజూ ముఖాన్ని పది నిముషాలు మసాజ్ చేయాలి. దీని వల్ల మంచి రిజల్ట్ పొందుతారు. రెడ్ వైన్ మీ చర్మం మీద డైరెక్ట్ గా ఉపయోగించవచ్చు. ఇది మీ చర్మానికి టోనింగ్ గా మరియు మృదువైన చర్మ సౌందర్యాన్ని అందిస్తుంది.ఇక రెడ్‌వైన్ ఆరోగ్యానికి మంచిదని చాలా పరిశోధనల్లో తేలడంతో అందరూ అది మంచిదనుకుంటున్నారు. అది నిజమే కానీ రెడ్ వైన్ ని కూడా పరిమితంగానే తీసుకోవాలంటున్నారు అధ్యయనకారులు.