ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేస్తుంటారు. కానీ అలా ఎప్పుడు చేయకూడదని ఆలా గాని చేస్తే అనారోగ్య సమస్యలు తప్పవని చెబుతున్నారు నిపుణులు. అయితే బ్రేక్‌ఫాస్ట్ రోజూ ఒకేలాంటిది కాకుండా, ప్రోటీన్లు, హెల్దీ ఫ్యాట్స్, కార్బొహైడ్రేట్స్ కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి పౌష్టికాహారం లభిస్తుందట.
ముఖ్యంగా చిన్నారులకు ఇలా పెట్టడం వల్ల వారు చదువుల్లో రాణిస్తారట. మెమోరీ కూడా షార్ప్ అవుతుందట. ఓట్స్, తృణధాన్యాలు, కోడిగుడ్లు వంటి ఆహారం తింటే మంచిదని న్యూట్రిషనిస్టులు సలహా ఇస్తున్నారు. అయితే బ్రేక్‌ఫాస్ట్ చేయడం వీలుకాకపోతే ఒక గ్లాస్ పాలు, కొన్ని నట్స్ తిన్నా చాలని అంటున్నారు. దాంతో శరీరానికి శక్తి, పోషకాలు దండిగా లభిస్తాయని అంటున్నారు. అదే విధంగా, ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది.
ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం వల్ల ఏ ఫుడ్మీదకి మనసు మళ్లదు. వేరే ఫుడ్ తినం. ఉదయమే బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే మధ్యాహ్నానికి ఆకలి పెరిగి ఎక్కువగా భోజనం చేస్తాం. దీంతో బరువు ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే మన బాడీ లో చెడు కొలెస్ట్రాల్ పెరిగి బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది..మెదడు చురుగ్గా పనిచేసేందుకు కూడా బ్రేక్ ఫాస్ట్ హెల్ప్ చేస్తుంది.. మనం తీసుకునే ఆహారం వల్లే మెదడుకి గ్లూకోజ్ అందుతుంది.. అప్పుడే మనం ఏ పనైనా సరిగ్గా చేయగలం..మనం ప్రతి రోజూ రాత్రి భోజనం చేస్తాం. ఆ తర్వాత చాలా గంటలు దాదాపు 10 గంటలు దాటిన తర్వాతే బ్రేక్‌ఫాస్ట్ చేస్తుంటాం. మనం బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే మెదడు చురుగ్గా పనిచేయదు. చేసే పని పట్ల ఆసక్తి తగ్గుతుంది. మతిమరుపు వంటి సమస్యలు కూడా వస్తాయి. ప్రతి రోజు బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వల్ల నెలసరి సమస్యలు, షుగర్ వ్యాధి, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు దూరం అవుతాయని చెబుతున్నారు నిపుణులు