అందంగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి.. ప్రతిఒక్క రూ ఎదుటివారికి అందంగా కనబడాలని కోరు కుంటారు. దాని కోసం ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయితే, అందంగా కనిపించడంలో బరువు కూడా ఓ భాగం. మరీ ఎక్కువ బరువు పెరిగితే.. చూడటానికి కూడా అంత బాగోదు. మహిళలు డెలివరీ అనంతరం ఎక్కువగా ఆహారం తీసుకోకపోయినా శరీరంలో కలిగే మార్పుల కారణంగా బరువు పెరిగిపోతుంటారు. దీంతో ఆందోళనకు గురికావడం.. తదనంతరం మానసిక రుగ్మతకు దారి తీయడం కూడా జరగవచ్చు.
అయితే, డెలివరీ అనంతరం కూడా బరువు పెరగకుండా ఉండాటానికీ.. వ్యాయమంతో సంబంధంలేని చిట్కాలతో బరువును తగ్గించుకోవచ్చు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ! డెలివరీ తర్వాత శరీరక శ్రమ చేయకుండా ఉండటంతో బరువు పెరిగిపోతుంటారు. అన్నం తినకుండా ఉండటంతో ఉంటే శరీర బరువు పెరుగుదలకు దారితీస్తుంది. ఎలా అంటే ఆహారం తీసుకోకుండా ఉంటే.. జీవక్రియరేటు మందగించి.. తీసుకునే కొద్దిపాటి ఆహారం నుంచి శరీరం కొవ్వును అధికంగా స్వీకరిస్తుంది. దీంతో బరువు పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి.
తగినంతగా నిద్రపోవడం వల్ల కూడా శరీర బరువు తగ్గుతుంది. తాజాగా జరిపిన అధ్యయనంలో ప్రసవం తర్వాత తగినంత నిద్రపోని వారి కంటే.. సరిపడా నిద్రపోయిన మహిళలు బరువు తగ్గారని తేలింది. శరీరానికి కావాల్సిన పోషకాహారం అందే విధంగా డైట్‌ను పాటిస్తే కూడా బరువు పెరగకుండా ఉంటుంది. దీని కోసం డైటీషన్ సలహాలు తీసుకోవడం ఉత్తమమైన మార్గం. అలాగే, డెలివరి అయిన తర్వాత ఆరోగ్య కరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం అధికంగా కూరగాయలు, చిరుధాన్యాల వంటకాలు తీసుకోవడం మేలు చేస్తాయి.
అలాగే, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కూడా డెలివరి అనంతరం మహిళలు బరువు పెరగకుండా ఉండటంలో మంచి ఫలితం ఉంటుందని పలు అధ్యయనాలు సైతం వెల్లడించాయి. అలాగే, తిపిపదర్థాలు, వేపుడు వంటకాలు తీసుకోవడంతోనూ బరువు పెరగకుండా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు. కరిగే ఫైబర్ ఆహారాలు జీర్ణక్రియను స్లో చేస్తాయనీ, దీంతో ఆకలి హార్మోన్ల స్థాయిలు తగ్గి చాలా సేపు ఆకలివేయదనీ, దీంతో బరువు పెరిగే అవకాశాలు తక్కువగా ఉంటయని వివరిస్తున్నారు. మరి మీరు కూడా ఈ చిట్కాలు పాటించి బరువు పెరగకుండా చూసుకోండి మరి.