ఇటీవల దేశవ్యాప్తంగా ఓ సర్వే జరిగింది. ఈ సర్వే యొక్క ఉద్దేశం ఏమిటంటే పెళ్లి కాకుండా దేశంలో ఎంత మంది సెక్స్ అనుభవం ముందే పొందుతున్నారు అనే విషయంపై సర్వే చేయగా సంచలన కరమైన ఫలితాలు వెలువడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో విషయానికొస్తే ఏ వయసులో శృంగార అనుభవం అబ్బాయిలు అమ్మాయిలు పొందుతున్నారు అన్నదానిపై జాతీయ సెక్సువల్ అవగాహన సంస్థ నిర్వహించిన సర్వేలో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి.
వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే తెలంగాణలో 35 శాతం ఆంధ్రాలో 45 శాతం మంది పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొన్నట్లు తేలింది. ముఖ్యంగా అనుభవం కోసం వేశ్య దగ్గరికి వెళ్లిన వాళ్ళు 16 శాతం మంది అబ్బాయిలు అని ఈ సర్వేలో బయటపడింది. ఇక బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ తో సెక్స్ 68 శాతం మంది పురుషులు 64% మంది స్త్రీలు చేసినట్లు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 19 సంవత్సరాలకు శృంగార అనుభవం పొందుతున్నట్లు తాజా సర్వేలో తేలింది.
ముఖ్యంగా దక్షిణాది కంటే ఉత్తరాది ప్రాంతంలోనే శృంగారంలో పాల్గొనే విషయంలో అమ్మాయిలు చాలా ఫాస్ట్ గా ఉన్నారని తాజా సర్వేలో వెల్లడైంది. ఇక కన్యత్వం గురించి మాట్లాడుకుంటే… ఉత్తరాది అమ్మాయిల కంటే దక్షిణాది అమ్మాయిలు చాలా బెటర్ పొజిషన్లో ఉన్నారని తేలింది. నార్త్ లో అమ్మాయిలకు 16సంవత్సరాల కి కన్యత్వం కోల్పోతున్నారని…ఉత్తరాదిలో పెళ్లి కాకుండానే ఎక్కువగా శృంగారానికి యువత మొగ్గు చూపుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. మొత్తం మీద శృంగారం విషయంలో దక్షిణాది కంటే ఉత్తరాది ప్రాంతం చాలా ఫాస్ట్ గా ఉందని జాతీయ సెక్సువల్ అవగాహన సంస్థ వెల్లడించిన సర్వేలో షాకింగ్ ఫలితాలు బయటపడ్డాయి.