NewsOrbit
హెల్త్

Hair Fall: మీ జుట్టు ఉడడానికి గల ప్రధాన కారణం ఏంటో తెలుసా..?!

Hair Fall:ఈ రోజుల్లో ఆరోగ్యం కన్నా అందానికే ప్రజలు ఎక్కువగా విలువ ఇస్తున్నారు అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి. అందంగా కనిపించడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల ఫేస్ ప్యాక్లు, క్రీమ్లు, హెయిర్ ఆయిల్ల్స్ వాడుతున్నారు. అవి వాడడం వలన అందం మాట ఎలా ఉన్నాగాని మీ పర్సుకు చిల్లుపడడం మాత్రం ఖాయం.

Hair &amp: Beauty: జుట్టుకు, అందానికి ఈ పండు చాలు..!!

Hair Fall: జుట్టు రాలడానికి కారణం ఏంటంటే..?

మనిషికి అందాన్ని ఇచ్చేది కేవలం ముఖం మాత్రమే కాదు. అందమైన జుట్టు కూడా మనిషి యొక్క అందాన్ని రెట్టింపు చేస్థాయి. అయితే ఈ కాలంలో చిన్నా పెద్దా అనే తేడాలేకుండా జుట్టు సమస్యలతో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి ముఖ్యంగా ఆడవాళ్ళకి జుట్టే అందం. కానీ జుట్టును కాపాడుకోవడం కోసం ఆడవాళ్లు రక రకాల హెయిర్ ఆయిల్స్ వాడి ఉన్న జుట్టు కాస్త ఊడిపోయేలా చేసుకుంటున్నారు. నిజానికి మీ అందరికి తెలియని విషయం ఏంటంటే మనం తీసుకునే పోషకాహారమే మన జుట్టుపై చాలా ప్రభావం చూపిస్తుంది. మన శరీరంలో ఎప్పుడయితే కొన్ని రకాల విటమిన్ల లోపం ఏర్పడుతుందో అప్పుడే జుట్టు కూడా విపరీతంగా రాలిపోతుంది.

Hair Growth: మీ డైట్ లో ఇవి ఉంటే జుట్టు ఊడమన్న ఊడదు..!!
ఏ విటమిన్స్ లోపం వలన జుట్టు రాలుతుందంటే..?

మరి ఆ విటమిన్లు ఏంటో తెలుసుకుందామా.. ముందుగా మనం అందరం విటమిన్ c గురించి తెలుసుకోవాలి. ఆరోగ్యం బాగుండాలంటే విటమిన్ c తప్పకుండా కావాలి. అలాగే  విటమిన్ c లో యాంటీ బయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ c లోపిస్తే లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏర్పడి జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. ఈ సి విటమిన్ అనేది సిట్రస్ ఫ్రూట్స్, స్ట్రాబెర్రీ, జామకాయలు, ఉసిరికాయలలో ఎక్కువగా ఉంటుంది. అలాగే జుట్టు ఆరోగ్యానికి విటమిన్ B ఎంతో అవసరం. విటమిన్ B ను బాయాటిన్ అని కూడా పిలుస్తారు. అయితే మన శరీరంలో ఈ బయోటిన్ లోపం ఏర్పడితే హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువ అవుతుంది ఈ బయటిన్ అనేది మాంసం, బాదం పప్పులు, ఆకు కూరలు, చేపలలో పుష్కలంగా అందుతుంది.

జుట్టు ఊడకుండా ఉండాలంటే..?

అలాగే విటమిన్ A గురించి మన అందరికి తెలిసే ఉంటుంది. విటమిమ్ A లోపం ఏర్పడితే జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. కాబట్టి మీ శరీరంలో విటమిన్ A లోపం లేకుండా చూసుకొండి. విటమిన్ A కోసం పాలకూర, చిలకడదుంపలు, క్యారెట్, బొప్పాయి, పెరుగు, పాలు, గుడ్లు తింటూ ఉండాలి.మన శరీరంలో రక్తశాతం తగ్గినాగాని జుట్టు సమస్యలు వస్తాయి. శరీరంలో ఐరన్ లోపం ఏర్పడితే రక్తాహీనత సమస్యతో పాటు హెయిర్ ఫాల్ సమస్య కూడా వస్తుంది. కాబట్టి తోటకూర, గుడ్లు, మాంసం ఎక్కువగా తినండి. వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పైన చెప్పిన విటమిన్స్ లోపం లేకుండా చూసుకుంటే మీ జుట్టు రాలే సమస్య తగ్గుముఖం పట్టడంతో పాటు జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri