NewsOrbit
హెల్త్

శృంగారం అంటేనే భయపడే అమ్మాయిలతో ఇలా మెలగాలి .. బాగా ఇష్టపడతారు !  

శృంగారం అంటేనే భయపడే అమ్మాయిలతో ఇలా మెలగాలి .. బాగా ఇష్టపడతారు !

తొలి కలయిక మీద అనుమానాలు ఉండటం సర్వ సాధారణం.అలా  ఉన్న వాళ్లు మరీ ఎక్కువ భయంగా అనిపిస్తే కౌన్సిలింగ్ తీసుకోవచ్చు.భార్య భర్తల మధ్య అనుబంధం పెరగడానాికి, ఒకరినొకరు అర్దం చేసుకోవడానికి,జీవితం ఆనందంగా, సాఫీ గా సాగిపోవాలంటే వారి లైంగిక జీవితం సాఫీగా సాగాలంటున్నారు నిపుణులు.

శృంగారం అంటేనే భయపడే అమ్మాయిలతో ఇలా మెలగాలి .. బాగా ఇష్టపడతారు !

సాధారణంగా తొలి కలయిక బాధిస్తుంది. తొలిసారి కాబట్టి,నొప్పిగా ఉంటుంది. కానీ,తరచు శృంగారంలో పాల్గొంటున్నా కూడా నొప్పి బాధిస్తుందంటే, దానికి కారణాలు తెలుసుకోవాల్సిందే. సాధారణంగా చాలా మంది దంపతుల్లో కలయిక పట్ల భయం ఉంటుంది. ఆ భయం కారణంగానే వారు అసౌకర్యంగా ఫీలౌతుంటారు. ఈ క్రమంలోనే శృంగారాన్ని పూర్తిగా అనుభవించలేరు. నొప్పి ఉంటుందేమో, తాము సరిగా స్పందించలేమేమో, బరువు ఎక్కువగా ఉండటం వల్ల ఆనందించలేమో ఇలా లేనిపోని అనుమానాలు పెంచుకుంటారు.

తొలి కలయిక మీద ఈ అనుమానాలు ఉండటం సర్వ సాధారణం. ఇలాంటి వాళ్లు మరీ ఎక్కువ భయంగా అనిపిస్తే కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. ఇక బరువు ఎక్కువగా ఉండటమే మీ సమస్య అనుకుంటే… సరైన డైట్ ఫాలో అయ్యి, రోజూ ఓ గంట వ్యాయామం చేస్తే సరిపోతుంది.తొలి కలయిక కాకపోయినా, తరచూ శృంగారంలో పాల్గొంటున్నా కూడా చాలమందికి యోనిలో నొప్పి బాధిస్తూ ఉంటుంది. ఆ నొప్పి కారణంగా వారు కలయికను ఆస్వాదించలేరు. అలాంటివారు కారణం ఏమైఉంటుందో కచ్చితంగా తెలుసుకోవాలి. కొందరిలో జననాంగాలు పొడిబారతాయి. మోనోపాజ్ దశలోనూ ఇలా జరిగే అవకాశం ఉంటుంది.ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదల కాకపోవడం వల్ల ఈ సమస్య ఎదురౌతుంది. మోనోపాజ్ తర్వాత యోనిమార్గంలోని పొర పల్చగా మారుతుంది. ఆ భాగం పొడిబారడం వల్ల నొప్పి వేధిస్తుంది.అలాంటప్పుడు వైద్యులను సంప్రదిస్తే పరిష్కారం లభిస్తుంది.

ఇన్ ఫెక్షన్లు, గర్భాశయ ముఖద్వారానికి సంబందించిన సమస్యలు ఉన్నా కూడా ఇలా కావొచ్చు.ముఖ్యంగా గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు ఈ నొప్పి కి కారణం కావొచ్చు. అండాశయాల్లో సిస్టులు ఉన్నా, ఎండోమెట్రియం పొర గర్భాశయంలో కాకంుడా బయట పెరిగి ఇలా నొప్పి, మంట వేధిస్తూ ఉంటుంది.సమస్యను బట్టి చికిత్స ఉంటుంది.

కొందరికి  ప్రసవ సమయంలో యోని భాగంలో గాయాలౌతుంటాయి. దాని వల్ల కూడా నొప్పి బాధించొచ్చు. లేదా లైంగికంగా సక్రమించే వ్యాధులు ఉండొచ్చు.వాటివల్ల దంపతులు ఇద్దరూ ఇబ్బందిపడాల్సి ఉంటుంది. కాబట్టి కండోమ్ వాడటం ఉత్తమం. ఇవన్నీ కాకుండా కూడా ఈ సమస్యను మిమ్మల్ని వేధిస్తుంటే.. సెక్స్ థెరపీతో సమస్యను నయం చేసుకోవచ్చు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri