భారతదేశంలో జనాభా ఎలా పెరుగుతుందో మధుమేహ బాధితులు కూడా అలానే పెరుగుతున్నారు. ఎన్ని మందులు వాడుతున్న కంట్రోల్ కాని వ్యాధి ఏమన్నా ఉందంటే అది మధుమేహ వ్యాధి. రోజు ఉసిరికాయ గుజ్జును తీసుకుంటే డయాబెటిస్‌ను తరిమికొట్టవచ్చు ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. ఉసిరి ఉపయోగాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఉసిరి ఆయుర్వేదంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఉసిరిలో అనేక రకాల విటమిన్ల వల్ల తల వెంట్రుకల నుండి కాలి గోళ్ళ వరకు మంచి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఉసిరి మానవ శరీరానికి అద్భుతంగా ఉపయోగపడే సర్వరోగ నివారిణి. షుగర్ వ్యాధితో బాధ పడేవారు రోజూ ఉదయాన్నే ఒక ఉసిరికాయ తినండి. దీనివల్ల శరీరానికి కావలసిన ఇన్సులిన్ అంది షుగర్ పెరగకుండా చూస్తుంది. ఉసిరి కాయ రోజు తినడం వల్ల శరీరంలోని చేదు కొలెస్టాల్ తగ్గుముఖం పడుతుంది. ఇందులో పుష్కలంగా లభించే విఓటమిన్ సి వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి తరుచుగా వచ్చే వ్యాధుల నుండి రక్షిస్తుంది.
జ్ఞాపకశక్తి మందగిస్తున్న వారికి ఉసిరి ఒక మంచి మెడిసిన్ అని చెప్పవచ్చు. ఉసిరి తినడం వల్ల మేధోశక్తి పెరగడమే కాదు శరీర దృఢత్వాన్ని పెంపొందిస్తుంది. ఇందులో విరివిరిగా లభించే ఆక్సిడెంట్ల వల్ల శరీరంలో వృద్ధి చెందుతున్న క్యాన్సర్ కణాలను అంతం చేస్తుంది. జుట్టు పెరుగుదలకు ఉసిరి చాల మేలు చేస్తుంది. తరచుగా అలసటకు గురవుతుంటే ఉసిరి రసంలో తేనే కలుపుకోయిని తాగితే నీరసం దరిచేరదు. అంతేకాదు మూల సమస్యలు కూడా తొలగుతాయి. కొందరికి కడుపులో నులి పురుగులతో సతమతమవుతుంటారు. అలాంటి వారు ఒక టేబుల్ స్పూన్ ఉసిరి రసంలో ఒక కప్పు లేత కొబ్బరి పాలను రోజుకు రెండు సార్ల చొప్పున తీసుకోవడం ద్వారా ఈ నులి పురుగుల సమస్య నుండి బయటపడవచ్చు.