Weight Loss: చాలా మందికి చూయింగ్ గమ్ తినే అలవాటు ఉంటుంది. ఎదో ఒక కారణం తో ఎప్పుడు నములుతూ ఉంటారు. మరి చూయింగ్ గమ్‌లను తినేందుకు ఇంకొందరు అసలు ఇష్టపడరు. అయితే ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఇకపై చూయింగ్ గమ్ అంటే ఇష్టం లేని వారు కూడా దాన్ని తినడానికి ఇష్టపడతారు. దానికి కారణం చూయింగ్ గమ్‌లను నమలడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వాటిగురించి తెలుసుకుందాం.
1. చూయింగ్ గమ్ తింటూ ఉంటే ఒత్తిడి తగ్గుతుంది అని సైంటిస్టులు చేసిన కొన్ని పరిశోధనలు సైతం రుజువు చేసాయి. బాగా ఆందోళన, టెన్షన్,ఒత్తిడి గా ఉన్నప్పుడు చూయింగ్ గమ్‌ను నోట్లో వేసుకుని నములుతూ ఉంటే వెంటనే ఆ పరిస్థితులనుండి బయట పడతారు అని సైంటిస్టులు తెలియచేస్తున్నారు. కాబట్టి మీకు కూడా బాగా ఒత్తిడి గా ఉంది అని అనిపించిన సమయం లో ఒక చూయింగ్ గమ్‌ను నములుతూ ఒత్తిడి నుండి బయట పడండి.
2. చూయింగ్ గమ్‌లను నములుతూ ఉండడం వల్ల మెదడు మరింత యాక్టివ్‌గా తయారై ఏకాగ్రత పెరిగి మీరు పనిచేసే తీరు కూడా మెరుగవుతుంది.
3.దంతాలకు సంబందించిన సమస్యలు,దంత క్షయం రాకుండా ఉండాలంటే చూయింగ్ గమ్‌లను నమలాలని డాక్టర్స్ కూడా సూచిస్తున్నారు.
4. షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్‌ను నమిలితే మాత్రమే ఈ ప్రయోజనం పొందగలుగుతారు.
5. బరువు తగ్గాలని భావించే వారికి కూడా చూయింగ్ గమ్ మంచి ఆప్షన్ గా చెప్పవచ్చు. మీ డైట్ ,వ్యాయామం ,తో పాటు చూయింగ్ గమ్ ను కూడా చేరిస్తే మరింత మంచి ఫలితం ఉంటుంది. ఆకలిగా అనిపించినప్పుడు చూయింగ్ గమ్‌ను నమిలితే ఆకలి తగ్గి ఆహారం తక్కువగా తిండడం జరుగుతుంది. చూయింగ్ గమ్ తినేవారిలో కేలరీలు ఎక్కువగా ఖర్చవుతాయట. అయితే మామూలుగా ఓ చోట కూర్చుని చూయింగ్ గమ్ తింటున్న వారితో పోల్చి చూస్తే వాకింగ్ చేస్తూ చూయింగ్ గమ్ నమిలే వారిలో బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానికి కారణం నడిచేటప్పుడు ఎక్కువగా శ్వాస తీసుకోవడం, త్వరత్వరగా నమలడం, జీర్ణక్రియ వేగం కూడా పెరిగి ఎక్కువ కేలరీలు త్వరగా బర్న్ అవుతాయి