NewsOrbit
హెల్త్

ఆషాఢం ప్రత్యేకతలు ఇవే !

జూన్‌ 22 నుంచి ఆషాఢమాసం ప్రారంభం. వచ్చే నెల 20 వరకు ఆషాఢమాసం. అయితే ఈ మాసంలో వచ్చే ప్రత్యేకతలు అనేకం ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం…

 

కాలగమనంలో వచ్చే మార్పుల ఆధారంగా మన పూర్వీకులు మాసాలను ఏర్పాటుచేశారు.

ఆషాఢ మాసము తెలుగు ఏడాదిలో నాలుగవ నెల. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు ఉత్తరాషాఢ/పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెల. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథునరాశి నుంచి కర్కాటకరాశి లోనికి ప్రవేశిస్తాడు. దాంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఆషాఢ శుద్ధ పర్ణమి రోజును గురుపౌర్ణమిగా వ్యవహరిస్తారు. మహాభాగవతాన్ని రచించిన వేద వ్యాసుడు జన్మించిన రోజును వ్యాసపౌర్ణమి అని కూడా అంటారు. వ్యాసుడు వేదాల్ని నాలుగు భాగాలుగా విభజించిన రోజు కూడా ఇదేనంటారు.

ఆడవారికి ప్రత్యేకం

కొత్త కోడలు అత్తవారి ఇంటి నుంచి తల్లిగారింటికి వస్తుంది. ఈనెల రోజులు తల్లిగారింట్లోనే ఉంటుంది. ఇక ఈ మాసం గోరింటాకు తప్పనిసరిగా పెట్టుకుంటారు. ఆహారంలో మునగకాయను విరివిగా వాడాలంటారు. ఈ మాసంలో ఇంద్రియ నిగ్రహంతో ఆహార విహారాలలో తగిన జాగ్రత్తను తీసుకుంటూ జీవితాన్ని గడపటం కోసం పూజలు, వ్రతాలుతో, నవ దంపతులకు ఆషాఢ నియమం పాటించమని చెబుతారు.ఆషాఢమాసంలో నవదంపతులు కలవకూడదనే ఆచారాన్ని మనదేశంలోని హైందవేతర మతస్తులు కూడా కొన్నిచోట్ల పాటిస్తుంటారు.

  • శ్రీమాత
  • కొత్త కోడలు, శ్రీవిష్ణువు ఫోటోలు వాడగలరు

 

ఆషాఢం గోరింటాకు సంబంధం ఏమిటి ?

ఆషాఢం వచ్చిందంటే మహిళలకు, బాలికలకు ముందు గుర్తుకువచ్చేది ఒకటి కొత్త కోడలు తల్లిగారింటికి వెళ్లడం. రెండోది గోరింటాకు. గోరింటాకు ఇష్టపడని ఆడవారు ఉండరు. రకరకాలుగా గోరింటాకు పెట్టుకుంటారు. ముఖ్యంగా ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే అనేక లాభాలు ఉంటాయని పెద్దలు చెప్తారు. అసలు గోరింటాకు ఎలా పుట్టిందో పురాణగాథలు తెలుసుకుందాం….

గోరింటాకు ..

గౌరి ఇంటి ఆకు….అది కాస్తా గోరింటాకు అయ్యింది. గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వలవుతుంది. ఆ రక్తపు చుక్క నేలతాకినంతనే ఓ మొక్క పుడుతుంది. ఈ వింతను చెలులు పర్వతరాజుకు చెప్పగా సతీసమేతంగా చూసేందుకు వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్ పార్వతీ రుధిరాంశతో జన్మించాను, నావలన లోకానికి ఏ ఉపయోగం కలదూ అని అడుగుతుంది. అపుడు పార్వతి (గౌరి) ఆచెట్టు ఆకు కోస్తుంది. ఆమె వేళ్లు ఎర్రబారిపోతాయి. అయ్యో బిడ్డ చేయ్యి కందిపోయినదనుకునే లోపుగానే పార్వతి నాకు ఏవిధమైనబాధా కలుగలేదు పైగా చాలా అలంకారంగా అనిపిస్తుందీ అంటుంది. పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గౌరింటాకు మానవలోకంలో ప్రసిధ్ధమవుతుంది.

 

గోరింటాకుతో లాభాలు ఇవే !

శాస్త్రీయంగా చూస్తే గర్భాశయదోషాలను తొలిగిస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది గోరింటాకు. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆబాలింతచేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయి. ఇక మొగుడికీ గోరింటకుకి గల అనుబంధం స్త్రీలోని స్త్రీత్వపు హార్మోనుల పనితీరు చక్కగా ఉన్నందు వలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది. అలా లేతగా ఉన్నచేత పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది. ఆ పండటం అనేది ఆమగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం.

ఏది ఏమైనా సహజ సిద్ధమైన గోరింటాకు ప్రకృతిలో దొరికే కలుషితం లేని పదార్థం. ఆర్టిఫిషియల్ రంగులతో అలంకరించుకునే దానికంటే సహజమైన గోరింటాకును పెట్టుకుంటే మంచిదని డాక్టర్లు, ప్రకృతి వైద్యులు చెప్తున్నారు. అలాగే వర్షాకాల ప్రభావంతో ఆషాఢం నుంచి వాతావరణంలో వచ్చే మార్పులకు గోరింటాకు పెట్టుకుంటే కొన్ని అంటురోగ ప్రమాదాన్ని నివారించవచ్చని పెద్దల అనుభవం. సహజ సిద్ధమైన గోరింటాకుతో ఆరోగ్యం, అందం పొందండి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri