Hair remove: వ్యాక్సింగ్ చేసేటప్పుడు కాస్త నొప్పి గా ఉన్న మళ్ళి తిరిగి హెయిర్ రావడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఎక్కువ మంది అవాంఛిత రోమాల తొలగింపు కోసం వ్యాక్సింగ్ చేసుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు. ఈ పద్ధతిలో ఫేషియల్ హెయిర్, లెగ్స్, ఆర్మ్స్, అండర్ ఆర్మ్స్, , బికినీ లైన్ దగ్గర ఉన్న హెయిర్ ను రిమూవ్ చేసుకోవచ్చు. వ్యాక్సింగ్ కిట్ ఉపయోగించి వెంట్రుకలు తొలగించుకోవాలనుకొంటే.. స్ట్రిప్‌ను చర్మానికి అతికించి చర్మాన్ని గట్టిగా పట్టుకొని వ్యతిరేక దిశలో వేగంగా లాగేయాలి.
నెమ్మదిగా చేస్తే నొప్పి ఎక్కువగా ఉండటం తో పాటు ఎక్కడి వెంట్రుకలు అక్కడే ఉండి పోతాయి. అ వ్యాక్సింగ్ ద్వారా అవాంఛిత రోమాలను రిమూవ్ చేస్తే రెండు నుంచి నాలుగు వారాలు వెంట్రుకలు పెరగకుండా ఉంటాయి. వ్యాక్సింగ్ తో ఫేసియల్ హెయిర్ తొలగించుకోవాలనుకొంటే మాత్రం పార్లర్‌కి వెళ్లడమే ఉత్తమం . త్రెడ్డింగ్ పద్ధతి లో ఐబ్రోస్,అప్పర్ లిప్, గడ్డం దగ్గర పెరిగే అన్ వాంటెడ్ హెయిర్ ని రిమూవ్ చేసుకోవచ్చు. త్రెడ్డింగ్ చేయడం ద్వారా వారం నుంచి పది రోజుల వరకు అవాంఛిత రోమాలు రావు . అయితే త్రెడ్డింగ్ చేసుకోవడం అలవాటు లేకపోతే.. దాని జోలికి వెళ్ళవద్దు. ఎందుకంటే దారం వల్ల చర్మం తెగే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఐబ్రోస్ షేపవుట్ కూడా కావచ్చు.
ట్వీజింగ్ తో కనుబొమ్మలు చక్కగా షేప్ చేసుకోవడానికి బాగుంటుంది. దీనితో పాటు అప్పర్ లిప్, చిన్ దగ్గర పెరిగిన వెంట్రుకలు తీసేయవచ్చు. ట్వీజింగ్ చేసుకుంటే.. సుమారు రెండు వారాల పాటు రోమాలు పెరగకుండా ఉంటాయి. ట్వీజింగ్ ద్వారా ఒక్కొక్క వెంట్రు తీసేయాల్సి ఉంటుంది . కాబట్టి ఎక్కువ సమయం పడుతుంది.ఇంటి దగ్గర అన్ వాంటెడ్ తీయాలనుకుంటే ఎపిలేటర్ తో కూడా ఆ పనిని తేలికగా చేసుకోవచ్చు. ఇది వెంట్రుకలను రూట్‌తో సహా తొలగిస్తుంది కాబట్టి.. చాలా రోజుల వరకు పెరగవు. ఈ పరికరంతో కాళ్లు, చేతుల పై ఉన్న వెంట్రుకలు రిమూవ్ చేసుకోవచ్చు