వంట రుచి పెరిగిన తగ్గినా కారణం ఉప్పు అని చెప్పాలి. అయితే ఉప్పు ఎక్కువైతే ఆరోగ్యంప్రమాదం లో పడుతుంది . జీవితంలో మంచిజరగడానికి ఉప్పు చాలా ఉపయోగ పడుతుందట. ముఖ్యంగా వాస్తు దోషాల నివారించడం లో ఉప్పు మంచి ఫలితాలని ఇస్తుందని వాస్తు నిపుణులు చెప్పే మాట . ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని దూరం చేసి.. పాజిటివ్ ఎనర్జీని పెంచుతుందని తెలియ చేస్తున్నారు . వాస్తుపరంగా ఉప్పు ను ఇంకాఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం..
ఇంట్లో ఎవ్వరికైనా అనారోగ్యం లేదా బలహీనత తో ఉన్నట్లయితే.. ఓ రాగి పాత్రలో కి ఉప్పును తీసుకుని బెడ్ రూమ్లో ఏదైనా ఒక ప్లేస్ లో ఉంచండి . ఇలా చేయడం వలన తప్పకుండా మంచి ఫలితా లు వస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని దానిలో ఉప్పు వేసి మూటగట్టి దాన్ని గుమ్మానికి వేళ్ళాడేలా కట్టండి.
మీరు వ్యాపారం చేస్తూ ఉంటే మీ దుకాణం ముందు లేదా ఆఫీస్ అయితే దాని ముందు ఆ ఉప్పు మూటను కట్టండి. ఇలా చేయడం వలన నెగటివ్ ఎనర్జీ పోవడం తో పాటు జ్ఞానం, అదృష్టం కలిసి వస్తుందని, చెడు ప్రభావాలు, దిష్టి వంటివి పోతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇంటికి ఉన్న వాస్తు పరమైన దోషాలు పోగొట్టుకోవాలంటే ఒక గ్లాసు లో కి ఉప్పును తీసుకుని బాత్రూమ్లోఉంచడం మంచిదట. ఉప్పు తో ఇలా చేయడం వలన ఇంట్లో ఉండే నెగటీవ్ ఎనర్జీని దూరం చేయడానికి, ఆటంకాలను పోగొట్టడానికి ఉపయోగపడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కుటుంబం అభివృధి కి కూడా ఇది మంచిదని చెబుతున్నారు .