NewsOrbit
హెల్త్

ఈ చిన్న ట్రిక్ తో .. పాలు కల్తీ నో ఒరిజినల్లో ఇట్టే చెప్పేయచ్చు !

మన వంటగదిలో చాలా వస్తువులు కల్తీ అవుతుంటాయి. వాటినిమనం గుర్తించలేము. గుర్తించినా పెద్దగా పట్టించుకోము. కానీ చివరకు అవే పెద్దపెద్ద రోగాలకు కారణమవుతుంటాయి. ఇలా కల్తీ అయ్యే ఆహారపదార్థాల్లో ప్రధానమైనది పాలు. జనం ఎక్కువగా పాల పై ఆధారపడుతుండటంతో సులువుగా కల్తీ జరుగుతుంది. పాలే విషమై ప్రాణాలు తీస్తున్నసంఘటనలు ఎన్నోఉన్నాయి. నీళ్లు, డిటర్జెంట్, స్టార్చ్ ,సింథటిక్ ..

With this little trick .. I can say that the milk is adulterated in the original
With this little trick .. I can say that the milk is adulterated in the original

ఇలా పాలను అనేక పద్ధతు ల్లో కల్తీ చేస్తున్నారు. అసలు పాల ను ఎలా కల్తీ చేస్తారో తెలుసుకుందాం. 5 కిలోల యూరియాను 100 లీటర్ల నీటిలో వేసి బాగా కలుపుతారు.అలా కలపడం వలన అది పాలలా తెల్లగా తయ్యారవవుతుంది. దానికి కొంచెం రిఫైన్డ్ ఆయిల్ 250 గ్రాము ల డిటర్జెంట్ ని వేసి కలుపుతారు. పాల వాసన వచ్చేందు కురసాయనాలతో తయారు చేసిన తెల్లని పొడిని కూడా వేసి కలుపుతారు. 60 లీటర్ల మాములు పాలలో 40 లీటర్ల తయ్యారు చేసేసి పెట్టుకున్న నకిలీ ద్రవాన్ని కలిపి 100 లీటర్ల కల్తీ పాలు సిద్ధం గా ఉంచుతారు. ఇంకో బయంకరమైన విషయం ఏమిటంటే దీంతో నే పన్నీర్ , కోవా, తయారు చేసి స్వీట్లు తయారుచేసే షాపులకు అమ్ముతుంటారు. నిజమైన పాలను, కల్తీ పాలను, మనం అస్సలు గుర్తించలేము. అందుకే కల్తీగాళ్ల వ్యాపారం జోరు గా సాగిపోతుంది.కల్తీ చేస్తున్నారు కదా అని ఆహారం తినకుండా ఎలా ఉండగలం.. . అందుకే కొనేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది . కల్తీని గుర్తించడం అనేది చాల కష్టం. కానీ కొన్ని పద్ధతుల్లో కల్తీని కనిపెట్టగలిగితే ఆరోగ్యం పాడవకుండా కాపాడుకోవచ్చు. మీరు తాగేవి అసలు పాలేనా? కల్తీ పాలా? అన్న విషయంతేలికగా తెలుసుకోవచ్చు. ఇందు కోసం పాత పద్ధతిలో
ఇంట్లో ఉండే చదునైన బండ పై రెండు చుక్కల పాలను వెయ్యండి అది మెల్లగా ఏదో ఓవైపు జారుతుంది . అలా పాలు జారిన వైపు తెల్లని చారలు గా కనిపిస్తే అవి స్వచ్ఛమైన పాలు . పాలు వేగంగా జారి జారిన దారిలో తెల్లగా ఏమీ కనిపించక పొతే మాత్రం అవి కల్తి పాలుగా గుర్తించాలి.
లేదా పాల కల్తీ ని గుర్తించడానికి ఉపయోగపడే పరికరాలు తక్కువ ఖరీదులో ఇప్పుడు అందు బాటులో ఉంటున్నాయి. వాటి ద్వారా గుర్తించే ప్రయత్నం చెయ్యాలి.
కర్నాల్స్ నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ఇది హర్యానా కి చెందినది. ఈ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పాల ను పరీక్షించే కిట్‌‌ని రూపొందించింది. ఈ కిట్ మార్కెట్‌లో రూ.3 కే దొరుకుతుంది . దీంతో పరీక్షించి కల్తీ పాలనుకనిపెట్టవచ్చు . లాక్టోమీటర్ ఇది రూ.100 నుంచి రూ.300 మధ్య మార్కెట్‌లో దొరుకుతుంది. పాలల్లో నీళ్లు కలిపారో లేదో తెలుసుకునేందుకు ఉపయోగపడే పరికరం ఇది.
కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా మిల్క్ టెస్టింగ్ కిట్‌ని రూ.50 కే అందుబాటులోకి తెచ్చాయి .
పీహెచ్ స్ట్రిప్స్ కొని దానిపైన ఒక చుక్క పాలను వేయాలి. పాలు కల్తీ కానట్టైతే పీహెచ్ రేషియో 6.4 నుంచి 6.6 మధ్య ఉంటుంది. అంతకన్నా ఎక్కువ లేదా తక్కువ ఉన్నట్టైతే పాలు కల్తీ అయినట్టే.ఇది కేవలం ఒక్క రూపాయి కి కూడా దొరుకుతుంది. కాబట్టి మనం ప్రతిరోజూ ఎక్కువగా ఉపయోగించే పాలను మాత్రం కల్తీ లేకుండా వాడే లాగా చూసుకోక పొతే అనారోగ్యాల పాలు కాకా తప్పదు.

Disclaimer : పైన సూచించిన ఆరోగ్య సూత్రాలు, లేదా హెల్త్ కి సంబంధించిన ఇన్ఫోర్మేషన్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది మాత్రమే. అవన్నీ పాటించే ముందర తప్పనిసరిగా స్పెషలిస్ట్ డాక్టర్ సలహా తీసుకోండి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri