NewsOrbit
జాతీయం బిగ్ స్టోరీ

BJP : రాహుల్ కు మతం పూసి బీజేపీ చిచ్చు రాజేసి!

BJP : రాహుల్ గాంధీ పర్యటన మీద బిజెపి తన అస్త్రాన్ని బయటకు తీసింది. కేరళ, తమిళనాడు, పాండిచ్చేరిలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజలతో మమేకం అవుతున్న రాహుల్ గాంధీ ఇమేజ్ పెరుగుతున్న దృష్ట్యా అతని పై ఎదురుదాడి చేసేందుకు బీజేపీ మతం రంగు అస్త్రం బయటకు తీస్తోంది. రాహుల్ పర్యటించిన ప్రాంతాల్లో క్రమంగా అతని వ్యక్తిగత ఇమేజ్ తో పాటు పార్టీ మెరుగుపడుతున్న తీరును పసిగట్టిన కాషాయం పార్టీ రాహుల్ గాంధీ కేవలం క్రైస్తవ మిషనరీ లకు సంబంధించిన ప్రాంతాల్లో మాత్రమే పర్యటనలు జరిపారు అంటూ కొత్త పల్లవి అందుకోవడం చూస్తే రాహుల్ పర్యటన కాంగ్రెస్కు కలిసి వచ్చిందనే చెప్పాలి.

BJP
BJP

** రాహుల్ ఇటీవల పర్యటించిన తమిళనాడులోని కన్యాకుమారి లో విద్యార్థులతో కలిసి పుషప్స్ చేశారు. అయితే కన్యాకుమారి లో చాలా యాదృచ్ఛికంగానే ఆ స్కూల్కి వెళ్లి విద్యార్థులతో మమేకమై సరదాగా తన దేహ దారుఢ్యాన్ని ప్రదర్శించేందుకు రాహుల్ ప్రయత్నించి, అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా బిజెపి ఆరోపణ ఏమిటంటే రాహుల్ కావాలనే ఎంచుకొని మరి క్రైస్తవ మిషనరీ కు సంబంధించిన స్కూల్ కు వెళ్లారని ఆరోపణలు గుప్పిస్తోంది. అక్కడి స్కూల్ సిబ్బంది సైతం రాహుల్ రాహుల్ అని అరిచారు అని, పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ఒక పార్టీకి సంబంధించిన నాయకుడికి ఎలా మద్దతు ఇస్తారానేది బీజేపీ ప్రశ్న.

** అలాగే కేరళలోని కొల్లం బీచ్ లో చేపలు పట్టడం, సముద్రంలో దూకడం మీద బీజేపీ అక్కసును వెళ్లగక్కారు తోంది. రాహుల్ తో పాటు సముద్రంలోకి వెళ్లిన ముగ్గురు జలర్లు క్రైస్తవ మతానికి చెందిన వారిని వారి పేర్లతో సహా సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలు పెట్టింది. అలాగే రాహుల్ ను అనుసరించినా వీడియో బ్లాగర్ మీద మత ముద్ర వేసి, కొత్త వివాదం చేయాలని బిజెపి ఆలోచిస్తోంది.

** రాహుల్ గాంధీ ప్రధాని పీఠానికి పోటీ పడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక మతాన్ని మద్దతు పలికెలా, అనుసరించేలా కావాలని ఎందుకు ఇలాంటి పనులు చేస్తారు అన్నది ఆలోచించాలి. ఎన్నికల ప్రచార సభల్లో నాయకులు పాల్గొని ఈ సమయంలో ఆయా వ్యక్తుల కులాలు, మతాలు, ప్రాంతాలు ఆలోచించి వారితో మమేకం అవ్వరు. కేవలం అక్కడి పరిస్థితి ని బట్టి వెంటనే అక్కడి వారితో కలిసేందుకు, ప్రజల్లో తాము ఉన్నామని చెప్పుకునేందుకు కొత్తగా ఏదైనా పని చేసేందుకు నాయకులు ఆసక్తి చూపుతారు. అంతే తప్ప తమ వద్దకు వచ్చిన వారి కులం మతం అడిగితే అది కొత్త సమస్యకు దారితీస్తుంది. ఎన్నికల ప్రచార సభల్లో జోరు మీద ఉన్న రాహుల్ చాలా యాదృచ్ఛికంగానే వారిని కలిసి ఉండొచ్చు తప్ప కావాలని ఒక మతానికి మద్దతు పలికేలా ప్రవర్తించి పనులు చేశారు అని చెప్పడం తప్పు.

** క్రైస్తవ మతాన్ని మద్దతు పలికేలా మిషనరీ సంస్థలతోపాటు వ్యక్తులను సైతం ఆపాదించి బిజెపి ఆరోపణలు చేయడం ఆ పార్టీ విజ్ఞతకే వదిలేయాలి. మొదటినుంచి మతం తాలూకా రాజకీయాల్లో ఆరితేరిన బిజెపి ఇప్పుడు రాహుల్ గాంధీ లక్షలాది రాష్ట్రాల పర్యటన విజయవంతం కావడంతో పాటు ఆయన వ్యక్తిగత ఇమేజ్ బాగా పెరగడంతో భుజాలు తడుముకున్నట్టు ఉంది. ఆయన పర్యటనకు ఏరికోరి కొన్ని ప్రాంతాలను వ్యక్తులను, ఎంచుకుని ఇప్పుడు ఆరోపణల జోరు పెంచు తుంది. రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి దేశానికి ప్రధాని పీఠానికి పోటీ పడిన వ్యక్తి ఒక మతాన్ని మద్దతు తెలిపే ఎలా ప్రవర్తిస్తే అది కాంగ్రెస్ పార్టీకే ముప్పు.

దేశంలో క్రైస్తవుల సంఖ్య చాలా తక్కువ. మరి రాహుల్ క్రైస్తవులకు మద్దతు తెలిపేలా ప్రవర్తిస్తే ఇతర మతాల నుంచి వారికి మద్దతు ఎలా ఉంటుంది. కేవలం క్రైస్తవులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఆ పార్టీ అధికారంలోకి రాగలద?? అది కనీస ఆలోచన ఉన్న ఏ నాయకుడు ఐనా ఆలోచించేది. అయితే బీజేపీ మాత్రం దీనికి విరుద్ధంగా మతం రంగు పులిమి కాంగ్రెస్ను రాహుల్ బదనాం చేయాలని ఇప్పుడు ప్రచారం ప్రారంభించిందని అనుకోక తప్పదు.

** దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో రాహుల్ గాంధీ తన వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకోవడానికి ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ప్రజల్లో కలవరు వారికి దూరంగా ఉంటారు అన్న ఇమేజ్ ను ఆయన దాటేందుకు ఈ పర్యటన ఎంతగానో దోహదపడింది. ప్రజలతో కలిసి పోవడం దగ్గర నుంచి ఆయన చేసిన కొన్ని విషయాలు యువతను ఆకర్షించాయి. ఇది స్పష్టంగా కనిపించడంతో బీజేపీకి ఇప్పుడు మతం గుర్తుకు వచ్చింది. వెంటనే రాహుల్ గాంధీ పర్యటన మీద ఒక ముద్ర వేయాలనే భావనతోనే ఈ ఆరోపణలకు పదును పెట్టి నట్లు స్పష్టంగా తెలుస్తోంది. దేశం కోసం ధర్మం కోసం వారు ఏం చేసినా తప్పు లేదు కానీ తన వ్యక్తిగత ప్రతిష్టను ఇమేజ్ను పెంచడానికి రాహుల్ ఏం చేసినా దానిలో లోపాలు ఎత్తి చూపడానికి బిజెపి నేతలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు.

Related posts

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతకు జైల్ అధికారులు షాక్ .. ములాఖత్‌కు అనుమతి నిరాకరణ..! ఎందుకంటే..?

sharma somaraju

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

Lok Sabha Elections 2024: భారీ భద్రత నడుమ మణిపూర్ లో కొనసాగుతున్న రీపోలింగ్

sharma somaraju

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju