NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Ramdev Baba Vs IMA: వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న రాందేవ్ బాబా..! వివాదం సద్దుమణిగినట్లేనా..! ఐఎంఎ ఏమంటుందో..!?

Ramdev Baba Vs IMA: అల్లోపతి వైద్య విధానంపై యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. అల్లోపతి వైద్య రంగాన్ని అవహేళన చేసేలా, కించపరిచేలా రాందేవ్ బాబా మాట్లాడటం, దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవ్వడం జరిగింది. దీనిపై  ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తీవ్రంగా స్పందించింది. ఆయనపై అంటు వ్యాధుల చట్టం కింద చర్యలు తీసుకుని ప్రాసిక్యూట్ చేయాలని కూడా ఐఎంఏ డిమాండ్ చేసింది. దీనిపై ఆయనకు లీగల్ నోటీసులు కూడా పంపింది.

Ramdev Baba Vs IMA episode Ramdev withdraw his statements
Ramdev Baba Vs IMA episode Ramdev withdraw his statements

అయితే దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ స్పందిస్తూ రాందేవ్ బాబా వ్యాఖ్యలను ఖండించడంతో పాటు రాందేవ్ బాబా ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని సూచించారు. రాందేవ్ బాబాకు వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ లేఖ కూడా రాశారు. కరోనా వారియర్స్ ను అవమానించేలా మీ ప్రకటన ఉంది. వారియర్స్ సెంటిమెంట్ ను దెబ్బతీసేవా ఉంది అని హర్షవర్థన్ తన లేఖలో పేర్కొన్నారు. దేశంలో ఎంతో మంది ప్రాణాలను అల్లోపతి మందులు కాపాడాయని గుర్తు చేస్తూ అలాంటి మందులు లక్షల మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యాయని అనడం దురదృష్టకరమని అన్నారు. తక్షణం ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని హర్షవర్థన్ రాందేవ్ బాబాకు సూచించారు.

Ramdev Baba Vs IMA episode Ramdev withdraw his statements
Ramdev Baba Vs IMA episode Ramdev withdraw his statements

దీనిపై ఆదివారం రాత్రి ట్విట్టర్ వేదికగా రాందేవ్ బాబా స్పందించారు. కేంద్ర మంత్రి హర్షవర్థన్ లేఖ తనకు చేరిందన్నారు. దాన్ని తాను గౌరవిస్తున్నాననీ, ఈ మొత్తం వివాదాస్పద వ్యవహారానికి సంబందించి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నాననీ పేర్కొన్నారు. రాందేవ్ బాబా తన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్లు గానీ క్షమాపణ చెప్పడం గానీ చేయలేదు. కేవలం వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇంతటితో ఈ వ్యవహారం సద్దుమణిగినట్లేనా లేక ఐఎంఏ ఆయనపై చర్యలకు పట్టుబడుతుందా అనేది వేచి చూడాలి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju