NewsOrbit
జాతీయం బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

UP Elections: యోగి బుల్ డ్రోజర్లు పని చేస్తాయా..!? అఖిలేష్ కి అగ్ని పరీక్ష..!?

up elections test for yogi and akhilesh

UP Elections: దేశంలో అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ బీజేపీకి ఎంతో కీలకం. ప్రస్తుతం అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్నాయి. ఈ ఫలితాలే బీజేపీకి 2024 జాతీయస్థాయి ఎన్నికలకు వెళ్లేందుకు ధైర్యాన్ని ఇచ్చినా.. ఆలోచనలో పడేలా చేసినా..! 5ఏళ్లుగా సీఎం యోగి ఆదిత్యనాధ్ పాలనలో తనదైన మార్క్ చూపించారు. రౌడీయిజం, ముఠాలు, గ్రూపులు, మతం.. యూపీ రాజీకీయాల్లో ప్రభావితం చూపిస్తాయి. ఫిబ్రవరి 20న మూడో దశ పోలింగ్ జరుగుతున్న సందర్భంలో సీఎం యోగి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తమది బుల్ డోజర్ల ప్రభుత్వంగా గతంలో చెప్పిన సీఎం.. ప్రస్తుతం అవి రిపేర్లో ఉన్నాయని మార్చి 10న మళ్లీ వస్తాయని అన్నారు. దీనిపై అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ కూడా మండిపడుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు.

up elections test for yogi and akhilesh
up elections test for yogi and akhilesh

వారందరినీ యోగి ఏరిపారేశారిలా..

రాష్ట్రంలో పేరుకుపోయిన ముఠా కక్షల్ని, అరాచక శక్తుల్ని, రౌడీయిజాన్ని బుల్ డోజర్లతో తొక్కించేశారు సీఎంగా యోగి. అంటే.. వారందరినీ ఏరి పారేయడం కంటే.. వారి మూలాల్ని, ఆర్ధిక వ్యవస్థల్ని దెబ్ట తీయడం ద్వారా రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న అరాచక శక్తుల్ని పెకిలించేశారు. దీంతో దేశంలో యూపీ అంటే ఇప్పటివరకూ ఉన్న అభిప్రాయాన్ని చెరిపేసి సరికొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. దీంతో కొందరు ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు సైలెంట్ అయిపోయారు.. మరికొందరు జైళ్లలో ఉన్నారు. అయితే.. యోగి పాలనను అరాచకమంటూ వీరిలో కొందరిని కాంగ్రెస్, అఖిలేష్ అండ్ టీమ్ బయటకి తీసుకొస్తున్నారు. కారణం.. అక్కడ ఓట్ల కోసం ప్రజల్ని ప్రభావితం చేసేది రాజకీయాలు కాదు.. రౌడీయిజం, ముఠాలే కాబట్టి..!

ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్..

వీరు చెప్పిన అభ్యర్దులే ఎమ్మెల్యేలు కావాలి.. తర్వాత వారి ఆటలు సాగాలి. వీటన్నింటికీ చరమగీతం పాడేశారు యోగి. అయితే.. దీనిని అరాచక పాలన అంటోంది అఖిలేష్ అండ్ టీమ్. కానీ.. ఏ రాష్ట్రమైనా వ్యవస్థల్లో గొప్పగా ఉండాలి.. ప్రజల్లో మంచి స్థానం కలిగి ఉండాలి. దశాబ్దాలపాటు జరుగుతున్న పరిణామాలు దేశంలో ఉత్తరప్రదేశ్ ను ప్రత్యేకంగా చూపించాయి. వీటిని మార్చారు యోగి. అందుకే ఎన్నికల్లో కూడా బుల్ డోజర్లు ఉపయోగిస్తారా..? అని ప్రశ్నించిన ప్రతిపక్షాలకు యోగి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా మెయిన్ పురి ప్రచారంలో పైవిధంగా స్పందించారు. మరి.. ప్రజలు ఏం తీర్పునిస్తారో చూడాల్సి ఉంది.

author avatar
Muraliak

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju