14,000 వేల కిలోమీటర్లు .. 16 గంటల ప్రయాణం.. బెంగుళూరు నుండి

 

ప్రపంచంలో సాంకేతికంగా అభివృద్ధి చెందిన టాప్ నగరాల్లో బెంగళూరు, శాన్ ఫ్రాన్సిస్కో కూడా ఉన్నాయి. కార్పొరేట్,ఐటి ఉద్యోగులు, అధికారులు సంవత్సరం పొడవునా రెండు నగరాల మధ్య రాకపోకలు చేస్తుంటారు. ఈ మార్గం బెంగళూరు విమానాశ్రయానికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది రెండు దేశాల మధ్య మంచి సత్సంబంధాలను నెలకొల్పడానికి ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియా జనవరి 11 బుధవారం నుంచి బెంగళూరు నుంచి శాన్ ఫ్రాన్సిస్కో మధ్య విమానయాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది..

 

Bangalore san Francisco

కరోనా లాక్ డౌన్ తర్వాత వెంటనే అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా మధ్య సంబంధాలను తిరిగి నెలకొలపనున్నట్లు కంపెనీ తెలిపింది. ఎయిర్ ఇండియా ఈ విమానానికి టిక్కెట్ల బుకింగ్ కూడా ప్రారంభించింది. బెంగుళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో శాన్ ఫ్రాన్సిస్కో కోసం వారానికి రెండు నాన్-స్టాప్ విమానాలు ప్రారంభించినట్లు తెలిపింది. బెంగళూరు నుండి శాన్‌ఫ్రాన్సిస్కో మధ్య తొలి విమాన ప్రయాణాన్ని జనవరి 11 నుంచి ప్రారంభించనున్నట్లు బెంగళూరు విమానాశ్రయం ఒక ప్రకటనలో తెలిపింది. బెంగళూరు నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకి డైరెక్ట్ సర్వీస్ ప్రయాణికులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

 

ఈ విమాన ప్రయాణం అంతర్జాతీయ మార్గంలో అతి పొడవైన విమాన సర్వీసులలో ఒకటి. కాలిఫోర్నియాలోని శాన్ఫ్రాన్సిస్కోకు బెంగళూరు నుంచి 14,000 కిలోమీటర్లకు పైగా దూరం ఉంటుంది. ఈ ప్రయాణానికి 16 గంటల సమయం పడుతుంది. ఇందువలన ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ విమానయాన సంస్థలు శాన్ ఫ్రాన్సిస్కోకు ప్రత్యక్ష విమానయాన సంస్థలను అందిస్తాయి.డైరెక్ట్ ఫ్లైట్ ప్రయాణీకులకు చాలా సౌకర్యాన్ని కల్పిస్తుందని, సమయం కూడా ఆదా అవుతుందని విమానాశ్రయం తెలిపింది. ప్రత్యక్ష విమాన సర్వీస్ ప్రవేశపెట్టడంతో, కార్పొరేట్ ప్రపంచంతో ముడిపడిన వ్యక్తుల ప్రయాణానికి ఇది బాగా ఉపయోగకరం.అంతేకాకుండా ఎయిర్ ఇండియా బోయింగ్ 777-200 ఎల్ఆర్ విమానాలను శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్తాయి.