2020 వరకూ కేజ్రీవాలే

ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ గా 2020 వరకూ కేజ్రీవాలే. పార్టీ జాతీయ కౌన్సిల్ నిన్న సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వచ్చే లోక్ సభ, డిల్లీ అసెంబ్లీ ఎన్నికల వరకూ కేజ్రీవాల్ నే పార్టీ కన్వీనర్ గా కొనసాగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆప్ జాతీయ కార్యదర్శి పంకజ్ గుప్తా ఈ విషయాన్ని నేడిక్కడ ప్రకటించారు

.జాతీయ కౌన్సిల్ సమావేశంలో పార్టీ రాజ్యాంగంలో ఎటువంటి మార్పులూ చేయలేదని తెలిపారు. 2019లో లోక్ సభ ఎన్నికలు, ఆ తరువాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ జాతీయ కౌన్సిల్ పదవీ కాలాన్ని కూడా ఏడాది పొడిగించినట్లు చెప్పారు.