NewsOrbit
న్యూస్

ఇంటర్ ప్రవేశాలపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

 

 

ఏపీలో నేటి నుంచే ఆన్లైన్ లో ఇంటర్ ప్రవేశాలు. కరోనా నేపథ్యంలో కళాశాలల్లో ప్రవేశాలు నిలిచిపోయాయి. దీనివలన ముఖ్యంగా పదిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు,వారి తల్లితండ్రులు ఇంటర్ లో వారి అడ్మిషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణం లో ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ లో ఇంటర్ ప్రవేశాలను చేపట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

 

ఏపీలోని ఇంటర్ కాలేజీల్లో ప్రవేశాలకు తొలిసారిగా ఆన్ లైన్ విధానాన్ని ప్రవేశ పెట్టినట్లు 2020-21 సంవత్సరానికి గాను విద్యార్థులు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.ఈ ప్రక్రియను అక్టోబర్ 21ఈ రోజు నుంచి అమలులో ఉంటుందన్నారు.ఏపీలో రెండేళ్ల ఇంటర్, ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు ఇందుకోసం ap inter admissions 2020-direct link ఏర్పాటు చేశారు

ఈ సందర్భంగా ఏపీ ఇంటర్ బోర్డు సెక్రటరీ రామకృష్ణ మాట్లాడుతూ. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఆన్లైన్ విధానంలో ప్రవేశాల ప్రక్రియ చేపట్టినట్లు చెప్పారు. విద్యార్థులు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ httpsbie.ap.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈనెల 29న తేదీ సాయంత్రం 5 గంటల లోగా విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కాగా. ఓసీ బీసీ కేటగిరీలకు చెందిన విద్యార్థులు రూ ౨౦౦, ఎస్సీ ఎస్టీ విభాగాలకు చెందిన విద్యార్థులు రూ 100 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు . విద్యార్థులకు సందేహాలు ఏమైనా ఉంటె 18002749868 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయ్యవచ్చని చెప్పారు. అడ్మిషన్ కోసం కళాశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా విద్యార్థులు ఎవరైనా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోలేకపోతే సమీపంలో ఉన్న వార్డు లేదా గ్రామ సచివాలయానికి వెళ్లి అక్కడ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఎటువంటి సర్టిఫికెట్స్ లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి టెన్త్ హాల్ టికెట్ నంబర్, కుల ఆదాయ ధృవీకరణ పత్రం నంబర్లు మాత్రమే అవసరం ఉంటుంది..నిజానికి ఈ అడ్మిషన్ల ప్రక్రియ సెప్టెంబర్ లోనే ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. అయితే అనివార్య కారణాలతో వాయిదా వేశారు. విద్యార్థులు ఎక్కడకి వెళ్లకుండా సులువుగా ఆన్లైన్ , దగ్గరలోని సచివాలయం లో అప్లై చేసుకోవచ్చని తెలిపారు.

author avatar
bharani jella

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N