బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అభిజిత్ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగుతోంది. హౌస్ లో ఉన్నంత కాలం తన మైండ్ గేమ్ తో ఫుల్ ఫోకస్ తో ఎక్కడా కూడా ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా టాస్క్ సమయంలో టాస్క్ ఆడుతూ.. మాట్లాడవలసిన సమయంలో పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ చాలా మందిని ఆకట్టుకున్నాడు. గత మూడు సీజన్లలో హౌస్ లో చాలామంది గేమ్ ఆడిన గాని.. ప్రముఖుల చేత ఎక్కువగా శభాష్ అనిపించుకో లేదు.
కానీ అభిజిత్ ఆడిన ఆట కి ఇండస్ట్రీలో చాలామంది సపోర్ట్ చేస్తూ అతడు గెలవాలని సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం నిజంగా అరుదైన విషయం అని చాలామంది అంటున్నారు. ఇదిలావుంటే ఇటీవల తనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి పుష్పగుచ్ఛాలు అభిజిత్ అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే గ్రాండ్ ఫినాలే ఈ రోజు హౌస్ లో అడుగుపెట్టిన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి, భారీ స్థాయిలో కామెడీ చేసిన సంగతి తెలిసిందే.
టాప్ ఫైవ్ లో ప్రతి ఒక్కరి ఆటతీరును మెచ్చుకుంటూ తనదైన శైలిలో వాళ్ళని కూడా నవ్వించడం జరిగింది. కాగా ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ త్రీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో అభిజిత్ కి ఓ చిన్న రోల్ ఉండే ప్రాముఖ్యత కలిగిన క్యారెక్టర్ ను రాసినట్లు ప్రత్యేకంగా అతని సినిమాల్లో చూపించాలన్న తరహా లో అనిల్ రావిపూడి స్క్రిప్టులో కొద్దిగా చేంజ్ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.