న్యూస్

మీరు SBI ఖాతాదారులా? అయితే మీ ఫోన్‌లో వుండకూడనివి ఇవే.!

Share

SBI: SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న SBIకి దేశవ్యాప్తంగా 47 కోట్ల మందికి పైగా కస్టమర్లు ఉన్నారు అంటే మనం నమ్మి తీరాల్సిందే. అందువల్ల ఈ బ్యాంక్ ఎప్పటికప్పుడు కస్టమర్లను సైబర్ మోసాల గురించి చెబుతూ అలెర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో SBIలో బ్యాంక్ ఖాతా కలిగిన వారు ఒక విషయం గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి అని సూచిస్తోంది.

SBI: ఖాతాదారుని స్మార్ట్‌ఫోన్‌లో ఇవి వుండకూడట?

అవును.. కస్టమర్ల స్మార్ట్‌ఫోన్‌లో ఇటువంటి యాప్స్‌ను అస్సలు ఇన్‌స్టాల్ చేసుకోకూడదట. ఎందుకంటే ఈ యాప్స్ వల్ల మోసాల బారినపడే అవకాశం లేకపోలేదు. ఆ యాప్స్ ఏమిటంటే, ఎనీ డెస్క్, క్విక్ సపోర్ట్, టీమ్ వ్యూయర్, మింగిల్ వ్యూ వంటి యాప్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోను స్మార్ట్‌ఫోన్స్‌లో ఇన్‌స్టాల్ చేసుకోకూడదు అని అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే.. మోసగాళ్లు వీటి ద్వారా మీ అకౌంట్ నుంచి డబ్బులు తస్కరించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతోంది.

అలాగే ఈ విషయాలపట్ల అవగాహన కలిగి ఉండాలి!

ఇకపోతే ఖాతాదారులు కేవలం ఈ యాప్స్ మాత్రమే కాకుండా మరి కొన్ని విషయాలను కూడా తెలుసుకొని గుర్తుపెట్టుకోవాలి. UPI వాడే వారు అందరికంటే అలర్ట్‌గా వుంది తీరాలి. మీకు తెలియని వారి నుంచి యూపీఐ కలెక్ట్ రిక్వెస్ట్ వస్తే దాన్ని వెంటనే రిజెక్ట్ చేయాలి. అలాగే తెలియని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం లాంటివి అస్సలు చేయొద్దు. ఇలా చేసినా కూడా మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతుందని గమనించాలి.


Share

Related posts

ఏపిలో జూలై 10 నుండి టెన్త్ పరీక్షలు

somaraju sharma

Karthika deepam: మోనిత బాబుని ఎత్తుకెళ్లింది వాడే.. ఈ ఎపిసోడ్ ట్విస్ట్ ఇదే.!

Ram

ద్వివేదికి ఈసి అవార్డు

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar