NewsOrbit
న్యూస్

రెస్టారెంట్లు కి వెళ్తే జాగ్రత్త అంటున్న అమెరికా పరిశోధకులు..!!

 

ప్రపంచ దేశాల్ని గడగడాలాడిస్తుంది కరోనా మహమ్మారి. కోవిద్-19 కి మందు లేకపోవడమే ఈ మహమ్మారి విలయ తాండవానికి కారణం. దేశాలు అన్ని ఈ వైరస్ ని కట్టడి చేయడానికి ఎప్పుడు లేని విధంగా లాక్ డౌన్ విధించి, ఎక్కడికి అక్కడ భద్రత చర్యలు చేపట్టాయి.ఈ లాక్ డౌన్ విధించిన కారణంగా ఆర్ధిక మాంద్యం లో కూరుకుపోయిన ప్రజల్ని దృష్టి లో పెట్టుకొని ప్రభుత్వాలు ఆన్ లాక్ ప్రక్రియ మొదలు పెట్టాయి. దీనిలో భాగంగా రెస్టారెంట్లు, జిమ్‌లు, హోటళ్ళు ఇలా పబ్లిక్ ప్లేస్స్ అన్ని ఒక ఒక్కటిగా తెరుచుకున్నాయి. వీటిలో ముఖ్యంగా రెస్టారెంట్లు, జిమ్‌లు,హోటళ్ళు తిరిగి తెరవడం వల్ల కోవిడ్ -19 ఇంకా ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతుంది అన్ని, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం మరియు నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు.

 

పరిశోధకులు చెప్పిన అంశాలు ప్రకారం.. వివిధ ప్రదేశాల్లో 98 మిలియన్ల మంది మొబైల్ డేటా నుండి సేకరించిన అంశాల ఆధారంగా వైరస్ సంక్రమణ స్థాయిని అంచనా వేశామని తెలిపారు. అమెరికా లోని నగరాల్లో ప్రజల కదలికలు బట్టి ఎక్కడికి వెళ్లారు? ఎంతసేపు ఉండిపోయారు? ఇంకా ఎంతమంది ఉన్నారు? మరియు వారు ఏ పొరుగు ప్రాంతాల నుండి సందర్శిస్తున్నారో డేటాను సేకరించారు. వారు ఆ సమాచారాన్ని కేసుల సంఖ్య మరియు వైరస్ ఎలా వ్యాపిస్తుందనే దానిపై డేటాతో కలిపి సంక్రమణ నమూనాలను రూపొందించారు. ఈ పరిశోధన అంచనా ప్రకారం రెస్టారెంట్లు, జిమ్‌లు,హోటళ్ళు ద్వారా, దాదాపు 600,000 కొత్త అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది అన్ని, ఈ అంటువ్యాధులు వల్ల వైరస్ మహమ్మారి ఇంకా విజృభించే అవకాశాలు ఉన్నాయి అన్ని పరిశోధకులు వెల్లడించారు. కాకపోతే ఏ వ్యాధులు రాకుండా మాస్క్ , సామాజిక దూరం, పరిశుభ్రత వంటి తగ్గిన జాగ్రత్తలు, ఈ మహమ్మారిని అదుపులో ఉంచడానికి ప్రధాన పాత్ర పోషిస్తాయి అన్ని పరిశోధకులు తెలిపారు. సీటింగ్ కెపాసిటీ 20% గా ఉండడం వల్ల 80% అంటూ రోగాలు వ్యాపించడం తగ్గింది అన్ని పరిశోధనలో తేలింది అన్ని నేచర్, మార్క్ లిప్‌సిచ్ , కెవిన్ మా వద్ద హార్వర్డ్ టి.హెచ్. చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు వెల్లడించారు. సీటింగ్ కెపాసిటీ 20% గా వినియోగించడం వల్ల ప్రధానంగా బిజీ సమయంలో వచ్చే కస్టమర్స్ ని మాత్రమే ప్రభావితం చేస్తాయి కాబట్టి, రెస్టారెంట్లు మొత్తం 42% మంది పోషకులను మాత్రమే కోల్పోతారు. దీన్ని వల్ల ఆర్థికంగా ఎక్కువ నష్టం వాటిల్లదు అన్ని, సీటింగ్ కెపాసిటీ తగ్గించడం వల్ల వైరస్ విజృంభణను తగ్గించ వచ్చు అన్ని అధ్యయనం సూచించింది.

 

ఈ డేటా పొరలన్నింటినీ జాతీయ వైరస్ డాష్‌బోర్డ్‌లో మిళితం చేయవచ్చు, ఇది వైరస్ తగ్గించడం కోసం తెలివిగా, మరింత లక్ష్యంగా ఉన్న విధానాలను రూపొందించడానికి విధాన రూపకర్తలకు సహాయపడుతుంది అన్ని టోపోల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. సంభావ్య వైరస్ హాట్ స్పాట్‌లను ఫ్లాగ్ చేయడానికి ఫిట్‌నెస్ ట్రాకర్లను మరొక మార్గంగా ఉపయోగించాలని ఆయన సూచించారు.

 

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju