న్యూస్

Anam Ramanarayana Reddy: జలవనరుల శాఖాధికారులతో ఆనం జగడం!జనరల్ గా జరిగిందా?వెనక ఏమైనా ఉందా?

Share

Anam Ramanarayana Reddy: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఆర్థిక శాఖ మంత్రి,సీనియర్ మోస్ట్ రాజకీయ నేత,ప్రస్తుతం నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసిపి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మరోసారి అధికారులపై ఫైర్ అయ్యారు.ఈసారి తన భాషకు మరింత పదును పెట్టారు.పైగా అధికారుల చర్యల కారణంగా జగన్ ప్రభుత్వం పరువు పోతుందంటూ ఆయన రాగాలు తీశారు.అదే సమయంలో జిల్లా నుండి కొత్తగా మంత్రి పదవి పొందిన కాకాని గోవర్థన్ రెడ్డిని కూడా రామ నారాయణరెడ్డి సీన్ లోకి లాగారు.

Anam Ramanarayana Reddy Fires on Irrigation Officers
Anam Ramanarayana Reddy Fires on Irrigation Officers

Anam Ramanarayana Reddy: సాగునీటి సలహా బోర్డు సమావేశం వేదికగా!

మూడు రోజుల క్రితం నెల్లూరు జిల్లా సాగునీటి సలహా బోర్డు సమావేశం జరిగింది.వివిధ అంశాలపై ప్రజాప్రతినిధుల ప్రశ్నలకు బదులిచ్చారు.ఈ క్రమంలో సంగం బ్యారేజీ ఎప్పటికీ సిద్ధమవుతుందని ఆనం రామనారాయణరెడ్డి ప్రశ్నించగా రెండు మూడు నెలల్లో పనులు పూర్తవుతాయని అధికారులు బదులిచ్చారు.దీనిపై రామనారాయణ రెడ్డి తీవ్రంగా స్పందించారు.ఎన్నాళ్లు ఈ కాకిలెక్కలు చెబుతారంటూ అధికారులను నిలదీశారు.ప్రస్తుత మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ఉన్నప్పటి నుండి సంఘం బ్యారేజీ పనులు కొనసాగుతూనే ఉన్నాయని ఆయన చెప్పారు.ఇంకా చాలా వర్క్ పెండింగ్లో ఉందన్నారు.అయినా తమకే అధికారులు తప్పుడు సమాచారం అందిస్తున్నారని ఆయన మండిపడ్డారు.”ఈ సమాచారం వింటుంటే మాకు సిగ్గు పోతోంది.మీకెలా ఉందో నాకు తెలీదు”అని ఆనం రామనారాయణరెడ్డి పరుష పదజాలం ప్రయోగించారు.

Anam Ramanarayana Reddy Fires on Irrigation Officers
Anam Ramanarayana Reddy Fires on Irrigation Officers

సీఎంవో కళ్లు కప్పుతున్నారు!

ఇలాంటి తప్పుడు సమాచారమిచ్చి సీఎంవో కళ్లను కూడా అధికారులు కప్పుతున్నారని మాజీ మంత్రి ఆవేశం వ్యక్తం చేశారు.వీరి సమాచారం ఆధారంగా సీఎం జిల్లాకు వచ్చినప్పుడు సంఘం బ్యారేజిని అప్పుడు ప్రారంభిస్తా ఇప్పుడు ప్రారంభిస్తారని చెప్పి వెళుతున్నారని,అది ఎప్పటికీ జరక్కపోవడంతో ప్రభుత్వ పరువు పోతోందన్నారు.తాము ప్రజలకు జవాబు చెప్పుకోలేకపోతున్నామని ఆయన తెలిపారు.ఇప్పటికైనా జిల్లా మంత్రిగా ఉన్న కాకాని నీటిపారుదల ప్రాజెక్టులపై దృష్టి పెట్టి అవి త్వరితగతితన పూర్తయ్యే బాధ్యతలు తీసుకోవాలని రాంనారాయణ రెడ్డి సూచించారు

ఇదే మొదటిసారి కాదు!

ఆనం రామనారాయణరెడ్డి అధికారుల మీద విరుచుకుపడటం ఇదేమీ మొదటిసారి కాదు.గతంలో ఒకసారి తన నియోజకవర్గం వెంకటగిరిని అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని,వారి భరతం పడతానని హెచ్చరించారు.ఈ మధ్యే జిల్లా పరిషత్ సమావేశంలో అటవీ శాఖ పై దండెత్తారు.అది అటవీశాఖ గాదు.. అవరోధ శాఖ అంటూ వ్యాఖ్యానించారు.చాలా కాలం మంత్రిగా ఉండి ప్రస్తుతం ఎమ్మెల్యేగా మిగిలిపోయిన ఆనం రామనారాయణరెడ్డి ఆ ఫ్రస్ట్రేషన్ తోటే ఇలా తమ మీద ధ్వజమెత్తుతున్నారని అధికారులు చెవులు కొరుక్కుంటుండడం కొసమెరుపు.


Share

Related posts

Romance: మీలో కామోద్రేకం తారా స్థాయికి చేరి,  మీ ప్రేయసి ని తృప్తి పరచాలంటే   ఇలా చేసి చూడండి !!

siddhu

BJP : కమలనాథులకు కరెంటు షాక్! కిమ్ కర్తవ్యమేమిటని తర్జనభర్జన!!

Yandamuri

Mahesh Babu :1st పాన్ ఇండియా మ్యూజిక్ ఆల్బంను రిలీజ్ చేసిన హీరో మహేష్ బాబు!

Ram