ఎమ్‌ఐఎమ్ ఎమ్ఎల్‌సి అభ్యర్థి ఖరారు

Share

హైదరాబాద్ ఫిబ్రవరి 25 : ఎమ్‌ఐఎమ్ ఎమ్ఎల్‌సి అభ్యర్థిత్వం మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెందీకు వరించింది. తెలంగాణలో శాసన సభ కోట ఎమ్ఎల్‌సి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొత్తం ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. అధికార టి‌ఆర్‌ఎస్ నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఒక స్థానాన్ని మిత్రపక్షమైన ఎమ్‌ఐఎమ్‌‌‌‌‌‌‌కు కేటాయించింది.

ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్‌ఐఎమ్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తమ పార్టీ అభ్యర్థి పేరును ప్రకటించారు. ఎమ్‌ఎల్‌ఏ కోటాలో ఎమ్ఎల్‌సి అభ్యర్ధిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెందీనీ ఎంపిక చేసినట్లు సోమవారం ప్రకటించారు. మీర్జా రియాజ్ ప్రస్తుతం దబీర్‌పుర కార్పొరేటర్‌గా కొనసాగుతున్నారు.

గత శుక్రవారం ముఖ్య మంత్రి కేసిఆర్ టి‌ఆర్‌ఎస్ ఎమ్ఎల్‌సి అభ్యర్థులను ప్రకటించారు. పార్టీ సీనియర్ నేత,హోం శాఖ మంత్రి ఎండీ మహమూద్‌ అలీకి మరోసారి కేసిఆర్ అవకాశం కల్పించారు. రాష్ట్ర కురమ సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం కురమ, ఎమ్‌డి‌సి చైర్మన్‌ శేరి సుభాష్‌ రెడ్డి, డోర్నకల్‌ మాజీ ఎమ్‌ఎల్‌ఏ సత్యవతి రాథోడ్‌ పేర్లను కేసిఆర్ ప్రకటించారు.


Share

Related posts

Huzurabad By Poll: ‘కారు’ ఎక్కుతున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి..! కౌశిక్ రెడ్డిలో టెన్షన్ స్టార్ట్ అయినట్లేనా..! కేసిఆర్ మనసులో ఏముందో..?

somaraju sharma

డైనోసార్ గుడ్లును ఎప్పుడైన చూశారా ?

Teja

somu verraju : వీర్రాజు నోట మాట రాకుండా చేసిన కొడాలి నాని

sridhar

Leave a Comment