న్యూస్ హెల్త్

పాలు తాగడం ఇష్టపడని పిల్లలు ఉంటే ఇది తాగించండి !!

పాలు తాగడం ఇష్టపడని పిల్లలు ఉంటే ఇది తాగించండి !!
Share

ఇదివరకు కాలంలో అన్నం వండే టప్పుడు  గంజి  తీసి పక్కన పెట్టేవారు. ఆ తర్వాత ఆ గంజి లో కొంచెం  ఉప్పు, నిమ్మ రసం కలుపుకుని తాగేసేవాళ్లు. ఇలా చేయడం వలన బియ్యంలో ఉండే  పోషకాలు  బాగా శరీరానికి అందేవి. అందుకే  గంజిని తాగే వారు. బహుస్య  అందుకేనేమో మన తాతలు, ముత్తాతలు ఆరోగ్యంగా ఉండే వారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది.

 

 

ఇప్పుడు ఎలక్ట్రిక్ కుక్కర్లో అన్నం వండడం వలన గంజి అంటే ఏమిటో నేటి పిల్లలకు తెలియదు. కానీ గంజి తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. ఆ గంజిని పారబోయటం అనేది జరగదు. మళ్లీ పాత రోజుల్లో వండినట్లు అన్నం వండటం మొదలవుతుంది. గంజి లో అన్నం వేసుకుని, కొంచెం  ఉప్పు వేసుకుని తింటే రుచిగా ఉండడం తో పాటు,శరీర ఉష్ణోగ్రతను అదుపుచేసుకోవచ్చు.

మజ్జిగ అందుబాటులో లేకపోతే  గంజిని అన్నం లో కలుపుకుని తింటే కడుపు నిండుగా ఉండడం తో పాటు శరీరాన్నికి చలవ చేస్తుంది.జ్వరం వచ్చినప్పుడు ఈ గంజిని  తాగితే త్వరగా తగ్గుముఖం పడుతుంది. చర్మాన్ని గంజి సున్నితంగా, అందంగా మార్చడంతో పాటు,చర్మ వ్యాధులు రాకుండా రక్షణ కలిపిస్తుంది. జీర్ణక్రియను సక్రమం గా చేసిమలబద్ధకాన్నిపోగొడుతుంది గంజి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం వలన శరీరం, మనసును ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.

నీరసంగా అనిపించినప్పుడు  గంజిని తాగితే ఓపికవస్తుంది. గంజి లో బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి .  ముఖ్యంగా పసిపిల్లలు, ఎదిగే పిల్లలకు రోజూ గంజిని తాగడం అలవాటు చేయడం వల్ల వారికి సరైన పోషకాలు అందుతాయి. శరీర ఎదుగుదల కు బాగా ఉపయోగపడుతుంది.  పాలు సరిగా తాగని పసి పిల్లలకు గంజి నీటినైనా తాగించవచ్చు. దీంతో కావాల్సిన శక్తి వారికి అంది పోషణ బాగా  లభిస్తుంది.
వేవిళ్లకు, విరేచనాలకు గంజిని మించిన దివ్యౌషధం లేదు . గంజి వార్చేలా అన్నం వండితే ,ఇంటిల్లిపాది గంజిని తాగితే ఆరోగ్యం మీసొంతం అవుతుంది.


Share

Related posts

Animal Faithfulness: కరోనా వేళ మంటగలుస్తున్న మానవత్వం.. విశ్వాసం చాటుకుంటున్న మూగజీవాలు

bharani jella

కరోనా లక్షణాలున్నాయి.. అయినా 2 సార్లు టెస్టు నెగెటివ్‌.. షాకింగ్‌..!

Srikanth A

లాక్ డౌన్ ప్రభావంతో పండగ వేళ బోసిపోయిన భద్రాచలం

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar