యాంకర్ సుమ తెలుగు అమ్మాయి కాకపోయినా ఆమె దగ్గర అయినట్లు రెండు తెలుగు రాష్ట్రాల టెలివిజన్ ప్రేక్షకులకు మరే యాంకర్ దగ్గర లేదు అన్నది వాస్తవం. ఎన్నో షోలలో యాంకర్ గా నటిస్తూ నేటి తరం యువ యాంకర్లకు పోటీగా నిలుస్తూ తనదైన టైమింగ్ తో ఆకట్టుకుంటూ సుమ అదరగొడుతోంది. మరొకవైపు సినిమా ఈవెంట్లు, ఇంటర్వ్యూల తో బిజీబిజీగా గడిపే సుమ కు ఈటీవీ క్యాష్ ప్రోగ్రామ్ తో ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఆమె హోస్ట్ గా వ్యవహరించే ఈ షో తెలుగులో టాప్ షోలలో ఒకటి.
ఇక ఈ షో లో వచ్చిన బిగ్ బాస్ విన్నర్ కౌశల్ సుమ కాపురంలో చిచ్చు పెట్టాడు. వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్ కు బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ లు కౌశల్, అమిత్, పూజా రామచంద్రన్, యాంకర్ శ్యామల లు గెస్ట్లుగా విచ్చేశారు. ఇక మామూలుగానే వారితో సుమ ఒక ఆట ఆడుకుంది. అయితే ఈ క్రమంలోనే కౌశల్ ఒకే ఒక స్టేట్ మెంట్ తో ఆమె కాపురం లో చిచ్చు పెట్టాడు.
కౌశల్ మాట్లాడుతూ… నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో మీరు రాజీవ్ కనకాల గారు బైక్పై వెళ్ళడం చూసాను అని చెప్పాడు. దీనికి స్పందించిన సుమ… మేము ఇద్దరం బైక్ పైన ఎప్పుడూ తిరగలేదు ఒకవేళ రాజీవ్ ఎవరినైనా ఎక్కించుకొని వెళ్తున్నాడా…? రాజా నువ్వు బైక్ పైన ఎవరిని తీసుకు వెళ్ళావు చెప్పు అనికోప్పడినట్లు యాక్టింగ్ చేసింది. దీంతో అందరూ నవ్వేశారు. ఇక ఇదంతా కామెడీగా జరిగింది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, సుమ ప్రేమవివాహం చేసుకున్న విషయం తెలిసిందే.