బిగ్ బాస్ హౌస్ లో దెయ్యాల గోలలు ఎక్కువైపోయాయి. ఇంటిలో ఉన్న సభ్యులందరినీ భయపెట్టాలని బిగ్ బాస్ దెయ్యం టాస్క్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. స్టార్టింగ్ లో అరియనా భయపడిన గాని తర్వాత హౌస్ లో వాతావరణం కామ్ అయిపోయింది. ఇక అవినాష్ సోహెల్ హారిక అయితే దెయ్యం పైన జోకులు వేస్తూ బిగ్ బాస్ ప్లాన్ కి బ్రేకులు వేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ రోజు ఎలాగైనా ఇంటి సభ్యులను టెన్షన్ పెట్టాలని … ఇంటిలో వాతావరణం మొత్తం దెయ్యాలకు భయపడే విధంగా మార్చాలని బిగ్ బాస్ డిసైడ్ అయిపోయాడు. దీంతో గార్డెన్ ఏరియా తో పాటు, కన్ఫెక్షన్ గదినీ కూడా దెయ్యాల కొంప గా మార్చేశాడు. ఇలాంటి తరుణంలో ఉన్నట్టుండి అవినాష్ ఇంటిలో దయ్యంగా మారి స్మశానం లో కూర్చుని, దెయ్యం పట్టిన వాడిలా కిల కిల నవ్వుతూ తాజా ఎపిసోడ్ ప్రోమో ఉండటంతో… హౌస్ లో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ ఇంట్రెస్ట్ ఆడియన్స్ లో నెలకొంది.
దీనిలో భాగంగా ఇంట్లో ఉన్న ఒక బొమ్మని అవినాష్ దొంగిలించి ఇంటి సభ్యులతో గొడవ పడుతూ ఆ బొమ్మను బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు విసిరేయటం తో… హౌస్ లో సరికొత్త టాస్క్ బిగ్ బాస్ అవినాష్ కి ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హౌస్ లో అవినాష్ ఎందుకు ఇలా మారాడు..? బొమ్మకి మరియు అవినాష్ కి మధ్య సంబంధం ఏమిటి అన్న టెన్షన్ ప్రస్తుతం ఆడియన్స్ లో నెలకొంది.