బిగ్ బాస్ 4: నాగార్జున వచ్చేస్తున్నాడు..!!

దసరా పండుగ నాడు బిగ్ బాస్ హోస్ట్ గా సమంత చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం సమంతా చేసిన యాంకరింగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాగార్జున తన కొత్త సినిమా “వైల్డ్ డాగ్” షూటింగ్ కోసం 21 రోజుల పాటు బిజీ కావడంతో..రాబోయే రోజుల్లో కూడా నాగార్జున వచ్చే పరిస్థితి లేదు అన్నట్టు రకరకాల వార్తలు వస్తున్నాయి. దీంతో నాగార్జున రాక వచ్చే వారం కూడా ఉండదు అన్నట్టు కన్ఫ్యూజన్ నెలకొంది.

Bigg Boss 4 Telugu to begin in August- Cinema expressఇదిలా ఉండగా లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ వారం బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున హోస్ట్ గా వచ్చే చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మనాలి నుండి శుక్రవారం హైదరాబాద్ లో ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది. దీంతో ప్రత్యేకంగా నాగార్జున బిగ్ బాస్ షో కోసమే హైదరాబాద్ వచ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

 

మరోపక్క దసరా ఎపిసోడ్ మాత్రమే కాకుండా సమంతతో 5వారాల డీల్ కూడా చేసుకున్నారని టాక్ నడుస్తోంది. దీంతో ఈ వారాంతం నాగార్జున యాంకరింగ్ గా అలరించడం బట్టి చూస్తే సమంత కేవలం దసరా స్పెషల్ ఎపిసోడ్ కి మాత్రమే ఉన్నట్టు బయట జనాలు ఫిక్స్ అయిపోయారు. కాగా నాగార్జున రాబోయే ఎపిసోడ్ కి డబుల్ ధమాకా ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ షో నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు సమాచారం.