Eyes: బయోటిక్ కాజల్ క్రీమీగా ఉండే ఈ కాటుక కళ్ళకు పట్టుకోవడం చాలా తేలిక . ఈ కాటుక పెట్టుకున్న తర్వాత కళ్లకు స్మోకీ లుక్ వస్తుంది. సహజసిద్ధమైన నూనెలతో తయారైన ఈ కాటుక కనురెప్పలకు పోషణ ఇవ్వడం తో పాటు వాటిని బాగా పెరిగే విధంగా సహాయపడుతుంది. దీనితో పాటు కళ్ల చుట్టూ ఉన్న చర్మానికి కూడా పోషణ ఇస్తుంది.హిమాలయ హెర్బల్స్ కాజల్ లో 5 రకాల సహజ పదార్థాలు ఉన్నాయి. ఆముదం, బాదం ,కర్పూరం,నూనె, గులాబీ, త్రిఫలాలు, మొదలైనవాటిని దీని తయారీలో వాడతారు. దీనిలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కళ్ల ఎరుపు ,వాపు, లాంటి సమస్యలు అడ్డుకుంటాయి.
Eyes: ప్రతి రోజు కాటుక పెట్టుకునే అలవాటు ఉన్నవారికి బాగా సరిపోతుంది.
ఫాబ్ ఇండియా ఆల్మండ్ కాజల్ లో షియా బటర్,బాదం నూనె,త్రిఫల, బీస్ వ్యాక్స్, పారఫిన్ వ్యాక్స్, ఆక్టైల్డోడెకనాల్ ఉన్నాయి. ఒక్కసారి దీన్ని వాడితే దీని పనితనం ఏమిటన్నది మీకే తెలుస్తుంది. ఇది కళ్ళకు పెట్టుకున్న తర్వాత కళ్ల కు చల్లదనం తగిలి.. చాలా హాయి గా కూడా ఉంటుంది. కాటుక పెట్టుకున్న చాలా సేపటి వరకు ఇది కళ్ళ కు నిలిచే ఉంటుంది. ప్రతి రోజు కాటుక పెట్టుకునే అలవాటు ఉన్నవారికి బాగా సరిపోతుంది. లోటస్ హెర్బల్స్ నేచురల్ కాజల్ లో కర్పూరం, బాదం నూనె, ఇతర సహజ సిద్ధమైన పదార్థాలు ఉన్నాయి. ఇవి కంటిరెప్పలు పెరగడానికి సహాయపడుతాయి. ఇది ఎక్కువ సమయం పాటు నిలిచి ఉంటుంది.
ఇబా హలాల్ కేర్ ప్యూర్ ఐస్ నేచురల్ కాజల్ తయారీలో బాదం,కార్బన్, విటమిన్ ఇ, కలబంద, నల్ల జీలకర్ర వాడతారు. సాధారణంగా కింది కనురెప్పలకు చాలా తేలికగా కాటుక పెట్టుకుంటారు కానీ పై రెప్పలకు పెట్టుకోవాలంటే మాత్రం కాస్త కష్టపడాల్సి వస్తుంది. కానీ ఈ కాటుకతో చాలా తేలికగా పెట్టుకోవచ్చు. గమనిక :ఎంత మేకప్ వేసుకున్న కళ్ళకు కాటుక లేకపోతే అందం రాదు. అసలు ఎలాంటి మేకప్ లేకపోయినా కాటుక ఒక్కటి పెట్టుకుంటే చాలు మీ అందం రెట్టింపు అవుతుంది అంటున్నారు నిపుణులు.