Eyes: కంటి ని శుభ్రపరచడంలో కాటుక పాత్ర చాలా ముఖ్యమైనది. అందుకే కాటుక పెట్టినప్పుడు కళ్ళు కొంచెం మండి నట్టు అనిపిస్తాయి.అంతమాత్రాన కాటుక పెట్టుకోవడం మానకండి. కళ్ళకు కాటుక పెట్టుకుంటే కంటిలోని ఎర్రటి చారలు తగ్గుతాయి.
ఇక బయట నుంచి వచ్చి పడే దుమ్ము, ధూళిని కళ్ళలోకి వెళ్లనివ్వకుండా కాటుక రక్షణ కల్పిస్తుంది.
కాటుక కళ్ళను ఎప్పుడు తాజాగా ఉంచుతూ, మెరుస్తూ ఉండేలా చేస్తుంది.
Eyes: కళ్లకు కాటుక పెట్టుకుంటే
కళ్లకు కాటుక పెట్టుకుంటే శరీరంలో వేడి తగ్గి చలువ కి వస్తుంది అని ఆయుర్వేదం కూడా సూచిస్తుంది.
కళ్ళలో భావాలు స్ఫష్టం,అందంగా తెలియాలి అంటే కాటుక పెట్టుకోవాల్సిందే.
కాబట్టి ప్రెజెంటేషన్, డెమో ఇచ్చే ఆడ వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇంతటి అద్భుతమైన ప్రయోజనాలను ఇచ్చే కాటుక కోసం కొన్ని కొన్ని బ్రాండ్ల ను తెలుసుకుందాం. మార్కెట్లో మనకు అందుబాటులో ఉన్న కొన్ని హెర్బల్ కాటుక లు గురించి తెలుసుకుందాం. వాటిని వాడటం వలన ఎలాంటి ఇబ్బంది ఉండదు పైగా వాటి ధర కూడా అందుబాటులో ఉంటుంది. అటువంటి కొన్ని బ్రాండ్లకు చెందిన కాటుక ల గురించి తెలుసుకుందాం.
1. బ్లూ హెవెన్ కాజల్ చాలా క్రీమీగా, సాఫ్ట్‌గా ఉండడం వలన కళ్ళకు పెట్టుకోవడం అప్లై చాలా తేలిక. దీనిలో వెన్న, తేనె, తో పాటు బాదం నూనె కూడా ఉంది.పైగా ఈ కాటుక కళ్ళకు రోజంతా నిలిచే ఉంటుంది. ధర కూడా అందుబాటులో ఉంది.
2. జోవీస్ కాజల్ ని త్రిఫల తో పాటు ఇతర ఆయుర్వేద మూలికలు, బాదం నూనె, కార్బన్ మొదలైన వాటితో కాటుక ను తయారు చేయడం జరుగుతుంది. దీన్ని వాడటం వల్ల మనకు రెండు ప్రయోజనాలు ఒకే సారి అందుతాయి. ఒకటి కళ్లు చాలా అందంగా కనిపిస్తాయి. రెండు కనురెప్పలు కూడా కాస్త ఒత్తుగా పెరుగుతాయి.