NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

BJP : కేరళ పై ఫోకస్ పెంచిన బీజేపీ! కమలం గాలానికి చిక్కిన పరుగుల రాణి?

5 States Elections Results: Did BJP Lost or Gain Their Votes..?

BJP : పలు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంటున్న క్రమంలో కేరళ లో కూడా అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరుగుతోంది. దేశమంతా బీజేపీ ప్రభుత్వమే కొలువు తీరాలనే కంకణం కట్టుకున్న బీజేపీ ఆ దిశగా పావులు కదుపుతోంది. ఓ పక్క పశ్చిమ బెంగాల్ లో తన జెండా ఎగురవేయాలని ఎత్తులు..మరోపక్క కేరళలో కూడా తన ప్రభావాన్ని చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. కమ్యూనిస్టుల కంచుకోట అయిన కేరళపై కాషాయనేతల కన్ను పడింది. దీంతో ప్రముఖులకు గాలం వేసి కేరళలో అధికారంలోకి రావటానికి యత్నాలు సాగిస్తోంది. దీంట్లో భాగంగానే పరుగుల రాణి పీటీ ఉషను రంగంలోకి దింపేందుకు ఎత్తులు వేస్తోంది.

BJP raises focus on Kerala
BJP raises focus on Kerala

BJP : కేరళలో భళిరా భళ!

కేరళపై బీజేపీ గురి పెట్టడంతో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మరోవైపు కేరళ నుంచే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కమ్యూనిస్టులకు బలమైన కోటగా ఉన్న కేరళపై కాషాయ నేతలు కన్నేశారు. కాంగ్రెస్ కూడా అదే పనిలో ఉంది. దీంతో కేరళలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన శ్రీధరన్ బీజేపీలో చేరుతున్న నేపథ్యంలో బీజేపీ క్యాడర్ లో కొత్త ఊపు వచ్చింది. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే సీఎం అభ్యర్థిగా తాను బరిలోకి దిగేందుకు సిద్ధమని శ్రీధరన్ ప్రకటించారు.

బిజెపిలోకి పరుగుల రాణి?

మరోవైపు పరుగుల రాణిగా భారతదేశ కీర్తి ప్రతిష్టలను చాటిన పీటీ ఉష కూడా బీజేపీలో చేరబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.పీటీ ఉష ఇప్పటికే బీజేకీ అనుకూలంగా తన గళాన్ని వినిపిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఆమె మద్దతు పలుకుతున్నారు. నిరసనలు చేపట్టిన రైతులకు మద్దతుగా అంతర్జాతీయ సెలబ్రిటీలు చేసిన వ్యాఖ్యలను కూడా ఆమె ఖండించారు. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ట్వీట్లు చేశారు. దీంతో ఆమె బీజేపీ కండువా కప్పుకోవటం దాదాపు ఖాయం అయిపోయినట్లే.కానీ తాను బీజేపీలో చేరుతున్నట్టు ఉష ఇంత వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఆమె బీజేపీ చేరటం ఖాయం అనేలానే ఉన్నాయి పరిణామాలు. అంతేకాదు, ఈ వార్తలపై స్పందించేందుకు ఆమె సన్నిహిత వర్గాలు కూడా పెదవి విప్పటంలేదు. దీంతో మౌనం అంగీకారం అన్నట్లుగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… కేరళకు చెందిన పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులను బీజేపీ ఆహ్వానించబోతున్నట్టు తెలుస్తోంది. వారితో ఎన్నికల గ్లామర్ పెంచి కమ్యూనిస్టుల కంచు కోటలో కాషాయ జెండా ఎగురవేయటానికి పావుల్ని అత్యంత జాగ్రత్తగా కదుపుతోంది.

 

author avatar
Yandamuri

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju