NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఆ రాష్ట్రంలో హైఅలర్ట్.. నల్లా నీళ్లలో మెదడును తినే అమీబా.. ఓ బాలుడు మృతి

Brain-eating amoeba found in texas water

ఆరు ఏళ్ల బాలుడు ఓ అమీబా వల్ల చనిపోయాడు. ఆ అమీబా అతడి మెదడుకు చేరుకొని మెదడును తినడం ప్రారంభించింది. దీంతో తీవ్ర అనారోగ్యానికి గురైన బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన యూఎస్ లోని టెక్సాస్ లో చోటు చేసుకుంది. ఆ బాలుడికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రిలో చేర్చగా.. ఆ బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందడంతో.. టెస్ట్ చేయగా.. అసలు విషయం బయటపడింది.

Brain-eating amoeba found in texas water
Brain eating amoeba found in texas water

ఆ బాలుడు చనిపోయింది.. నాగ్లేరియా ఫౌలేరీ అనే సూక్ష్మజీవి వల్ల అని తేలింది. దీంతో వెంటనే ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. టెక్సాస్ గవర్నర్ కూడా రాష్ట్రంలో విపత్తును ప్రకటించారు.

ఇప్పటికే ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతుంటే యూఎస్ లో మరో మహమ్మారి రావడం ప్రపంచాన్ని కలిచివేస్తోంది. ఈ అమీబా… నీటిలో నివసిస్తుంది. మనిషి ముక్కు నుంచి శరీరంలోకి వెళ్లి.. అక్కడి నుంచి నేరుగా మెదడుకు చేరుకొని కొంచెం కొంచెంగా మెదడును తినేస్తుంది. దీంతో ఆరోగ్య సమస్యలు ప్రారంభం అవుతాయి.

అది మెదడుకు చేరగానే… విపరీతమైన తలనొప్పి, వాంతులు అవుతాయి. మతిమరుపు, ఒత్తిడి, అలసట లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

Brain-eating amoeba found in texas water
Brain eating amoeba found in texas water

ఈ అమీబా నల్లా నీళ్లలో, మురుగునీళ్లలో, కుంటల్లో ఉన్న నీళ్లలో ఉంటుంది. కాబట్టి.. నీటిని వేడి చేసుకొని తాగాలని.. స్నానానికి కూడా వేడి నీళ్లనే ఉపయోగించాలని ప్రభుత్వం సూచించింది.

చనిపోయిన బాలుడు కూడా కూళాయి వద్ద నీటితో ఆడుకున్న సమయంలోనే అమీబా ముక్కు ద్వారా అతడి శరీరంలోకి ప్రవేశించిందని అధికారులు గుర్తించారు.

ఈ అమీబా.. టెక్సాస్ కు ఇప్పుడే కొత్తేమీ కాదు. 1983 నుంచి 2010 మధ్యలో దీని వల్ల 28 మంది మరణించారు. మళ్లీ తాజాగా ఆ సూక్ష్మజీవి వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. వెంటనే ప్రజలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కరోనాతో పాటు.. ఈ మహమ్మారితోనూ పోరాడుతామని ప్రకటించింది.

author avatar
Varun G

Related posts

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?