Categories: న్యూస్

Breaking: గ్రీన్ కార్డులపై కీలక నిర్ణయాన్ని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడ జోబైడెన్.

Share

Breaking: గ్రీన్ కార్డుల జారీపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆరు నెలల్లో గ్రీన్ కార్డు ధరఖాస్తులను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో అమెరికన్ గ్రీన్ కార్డు కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయుల కల త్వరలో తీరబోతున్నది. భారతీయ అమెరికన్ అజయ్ జైన్ భుటోరియా గ్రీన్ కార్డు జారీ ప్రక్రియను అరు నెలల్లో పూర్తి చేయడంపై ప్రభుత్వానికి స్పష్టమైన సూచనలు చేశారు. జనాభా పెరిగినా..అమెరికా వీసా విధానంలో మార్పులు రాలేదనీ తెలియజేస్తూ ప్రస్తుత పరిస్థితులను సమీక్షించుకుని నిర్ణయాలు వేగంగా వెలువడేలా అవసరమైన చోట్ల మార్పులు చేయాలని అజయ్ జైన్ అమెరికా పౌరసత్వ వలసదారుల సేవల సంస్థ (యూఎన్‌సీఇఎస్)కు సిఫార్సు చేశారు. గ్రీన్ కార్డు వీసా ఇంటర్వ్యూలు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని అందుకోసం అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకోవాలని ప్రభుత్వానికి అజయ్ జైన్ ప్రతిపాదించారు. కమిటీ నివేదికపై జో బైడెన్ సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Breaking joe biden key decisions on green cards

Breaking: భారతీయ ఐటీ నిపుణులకు లబ్ది

అమెరికాలో శాశ్వత నివాసం ఉండేందుకు అనుమతిస్తూ ఆ ప్రభుత్వం వలసదారులకు ఇచ్చే గుర్తింపు పత్రమే గ్రీన్ కార్డు. హెచ్ 1 బీ వీసాలపై అమెరికా వెళ్లే ఐటీ నిపుణులు ఈ గ్రీన్ కార్డు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. అయితే ఒక్కో దేశానికి ఏడు శాతం మాత్రమే గ్రీన్ కార్డులు ఇవ్వాలన్న నిబంధన సహా ప్రస్తుతం ఉన్న వీసా విధానం దీనికి ఇబ్బందికరంగా మారింది. దీంతో కొందరు గ్రీన్ కార్డు కోసం దశాబ్దాల తరబడి వేచి చూడాల్సిన వస్తోంది. ఇప్పుడు అజయ్ జైన్ కమిటీ సిఫార్సులపై అధ్యక్షుడు జో బైడెన్ సానుకూల నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు లబ్ది చేకూరనుంది.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

15 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

24 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

1 hour ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago