భారత టాప్ కార్ డిజైనర్లలో దిలీప్ చాబ్రియా ఒకరు.. ఈయన డిసి డిజైన్ కార్ మోడిఫికేషన్ స్టూడియో వ్యవస్థాపకుడు.. ఇంకా డిసి అవంతి అనే మేడిన్ ఇండియా స్పోర్ట్స్ కార్ రూపకర్త.. బాలీవుడ్ ప్రముఖుల కోసం ప్రత్యేకమైన కార్లను రూపొందిస్తుంటారు.. ప్రముఖుల కోసం ప్రత్యేకంగా కస్టమైజ్డ్ కార్లను తయారుచేస్తుంటారు.. తాజాగా దిలీప్ చాబ్రియా ను ముంబై పోలీసులు సోమవారంనాడు అరెస్టు చేశారు . ఫోర్జరీ కేసులో అరెస్టు చేసినట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ కు చెందినా క్రిమినల్ ఇంటెలిజెన్స్ యూనిట్ సీఐయూ పోలీసులు తెలిపారు..
బహుళ కార్ల రిజిస్ట్రేషన్ రాకెట్ కు సంబంధించిన మోసం, ఫోర్జరీ కేసులో చాబ్రియా పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ముంబై పోలీసు జాయింట్ కమిషనర్ మిలింద్ భరంబే తెలిపారు. అంతేకాకుండా 75లక్షల రూపాయల విలువైన హైడ్ స్పోర్ట్స్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో రిజిస్ట్రేషన్ పత్రాలను నకిలీ చేసి వాటి సాయంతో బహుళ వాహనాలను రిజిస్ట్రేషన్ చేయడం వలన ఆయన మీద ఐదుగురు ఫిర్యాదు చేయగా, వారిలో ఒక ప్రముఖ నటి కూడా ఉన్నట్లు సమాచారం.
చాబ్రియా పై భారతీయ పీనల్ కోడ్‌లోని ఐపీసీ సెక్షన్ లోని 420,465,467,468,471,120(బి), 34 సెక్షన్ల క్రింద అరెస్ట్ చేశారు. మరిన్ని ముఖ్య సమాచారం తెలిపేందుకు మిలింద్ భరంబే నిరాకరించారు. ఈ కేసు లో చాబ్రియా పై చీటింగ్, ఫోర్జరీ, విశ్వాస ఉల్లంఘణ, నేరపూరిత కుట్రలకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ముంబై పోలీసులు తెలిపారు.