NewsOrbit
జాతీయం న్యూస్

IMA: ఐఎంఎ డిమాండ్ పై కేంద్రం స్పందన!అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే??

IMA: అల్లోపతి మీద,ఆ క్యాటగిరీ వైద్యుల మీద యోగా గురు బాబా రాందేవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎట్టకేలకు కేంద్రం స్పందించింది.అయితే కట్టె విరక్కుండా పాము చావకుండా అన్న ధోరణిని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ బీజేపీకి అనుకూలంగా ఉండే రాందేవ్ విషయంలో ప్రదర్శించారు.ఇష్టానుసారం అల్లోపతి వైద్యాన్ని కించపరిచేటట్లు,ఆ క్యాటగిరీ వైద్యులపై ప్రజలకు దురభిప్రాయం ఏర్పడేటట్లు వ్యాఖ్యలు చేసిన బాబా రాందేవ్ ను ప్రాసిక్యూట్ చేయాల్సిందిగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో పోస్టింగ్ ద్వారా నిన్న డిమాండ్ చేయటం తెలిసిందే.దానిపై ఆదివారం స్పందించిన హర్షవర్ధన్ ఇంతటి పెద్ద సమస్య కు అతిచిన్న సొల్యూషన్ చూపించారు!

central government response to ima demand
central government response to ima demand

మంత్రి ఏం చెప్పారంటే?

బాబా రాందేవ్ ను తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాల్సిందిగా లేఖ రాశాను.ఆయన స్పందన కోసం ఎదురుచూస్తున్నా..అంటూ కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఆదివారం ట్వీట్ చేశారు.కచ్చితంగా బాబా రాందేవ్ వ్యాఖ్యలు అల్లోపతి వైద్య రంగాన్ని కించపరిచేవిగా ఉన్నాయని మాత్రం ఆయన అంగీకరించారు.ఇంగ్లీషు మందుల వల్ల కరోనా రోగులు వేలసంఖ్యలో చనిపోతున్నారని రామ్దేవ్ అనడం సరికాదని మంత్రి పేర్కొన్నారు. ఐఎంఏ ఆవేదనతో తాను ఏకీభవిస్తున్నానని మంత్రి తెలిపారు.

IMA: ఐఎంఏ అసంతృప్తి !

కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తమ ఆవేదనను అర్థం చేసుకోవడం పట్ల ఐఎంఏ హర్షం వ్యక్తం చేసినప్పటికీ కేవలం వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే చాలునని బాబా రామ్దేవ్ కి సూచించడం పట్ల అసంతృప్తి వెలిబుచ్చారు. ఇష్టానుసారం మాట్లాడిన బాబా రామ్ దేవ్ పై అంటువ్యాధుల చట్టం కింద చర్యలు తీసుకొని ప్రాసిక్యూట్ చేయాలని తాము కోరగా కేవలం ఆయన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే చాలునన్నట్లు కేంద్రమంత్రి ఆప్షన్ ఇవ్వడాన్ని వారు ఖండించారు.అల్లోపతి వైద్యుల్లో ఆధునిక హంతకుడిగా రాందేవ్ అభివర్ణించడాన్ని వారు మరోసారి కేంద్ర మంత్రి కి గుర్తుచేశారు.రామ్ దేవ్ వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే చాలదని ,తప్పనిసరిగా ఆయనపై చర్యలు తీసుకోవల్సిందేనని ఐఎంఏస్పష్టం చేసింది.

అసలు జరిగింది ఇదీ!

బాబా రాందేవ్‌ ఆధునిక వైద్యశాస్త్రాన్ని, వైద్య విధానాలను అవమానించే విధంగా మాట్లాడుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.అందులో అల్లోపతి వైద్యాన్ని రాందేవ్ అవహేళన చేశారు.అల్లోపతి అనేది ఒక పనికిరాని సైన్స్ అంటూ రాందేవ్ వ్యాఖ్యానించారు.అల్లోపతి మందులు తీసుకున్న లక్షలాది మంది కోవిద్ రోగులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.భారత డ్రగ్ కంట్రోలర్ ఆమోదించిన రెమిడిసీవర్,ఫావి ఫ్లూ వంటి మందులు కూడా కూడా కరోనాను నయం చేయలేకపోయాయని రాందేవ్ అన్నారు.అంతకుముందు మరో సందర్భంలో రాందేవ్ వైద్యులనుద్దేశించి ఆధునిక హంతకులని వ్యాఖ్యానించారు.దీంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భగ్గుమనడం తెలిసిందే .

 

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju