Joint families :పిల్లలు ఉమ్మడి కుటుంబం లో పెరిగితే ఎలా ఉంటారు?చిన్న కుటుంబం లో పెరిగితే ఎలా ఉంటారు తెలుసుకుందాం.. భార్య భర్త ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటే.. మీ పిల్లలను చూసుకోవడం కష్టమవుతుంది. దానితో పాటు పిల్లలకు తల్లిదండ్రులతో కలిసి ఉండే సమయం చాల తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఉమ్మడి కుటుంబంలో Joint families ఉంటే పిల్లల ఆలనా పాలనా చూడటానికి ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. అదే చిన్న కుటుంబం అయితే పిల్లలను డే కేర్ వంటి వాటిలో వేయవలసి ఉంటుంది. దానికంటే ఇంట్లో నానమ్మ లేదా అమ్మమ్మ నో ఉంచుకోవడం ఉత్తమం .
ఒక వేల మీ కుటుంబంలో ఉండే వాళ్ళు పిల్లలను పెంచడంలో భిన్నమైన భావాలూ ఉంటే కనుక.. అవి మీ ఆలోచనలతో సరిపడకపోతే చిన్న కుటుంబంలో పెంచుకోవడం మంచిది.
ఉమ్మడి కుటుంబంలో పెరిగే పిల్లలలతో పోల్చి చుస్తే చిన్న కుటుంబంలో పెరిగే పిల్లలకు ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది. ప్రతి చిన్న దానికి ఎవరో ఒకరి మీద ఆధారపడకుండా వారి పని వాళ్ళే చేసుకోవడం మొదలు పెడతారు.
అయితే ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే, పిల్లలు స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నారా లేక ఒంటరిగా అయిపోతున్నారు అన్నది ఎప్పుడు కనిపెట్టుకుంటూ ఉండాలి. పిల్లలు ఒంటరిగా ఉంటున్నట్టు భావిస్తే మాత్రం ఉమ్మడి కుటుంబం మంచిది అనే చెప్పాలి.ఉమ్మడి కుటుంబంలో పెరిగే పిల్లలకు తల్లిదండ్రుల నుంచి మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎన్నో ఆలోచనల తో లోక జ్ఞానం పెరుగుతుంది. ఇంట్లో మంచి ప్రవర్తన కలిగిన మనుషులు ఉంటే పిల్లల మీద వారి ప్రభావం పడి పిల్లలు కూడా మంచి మార్గంలో వెళ్తారు . అదే చిన్న కుటుంబంలో ఉంటే ఈ విషయం మీద తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది.
ఏది మంచి ఏది చెడు అని పిల్లలకు ఎప్పటికప్పుడు చెప్తూ వారిని మంచి మార్గంలో ఉండేలా చేయాలి. ఉమ్మడి కుటుంబం లో పెరిగే పిల్లలకు సమాజం లో ఎలా ఉండాలి ?ఎలాంటి వారు ఉంటారు ?ఎలా డీల్ చేయాలి అన్నది వారంతట వారే నేర్చుకుంటారు. ఒకవేళ మీది చిన్న కుటుంబం అయినప్పటికీ మీ పిల్లలను అప్పుడప్పుడు చుట్టాలింటికి, ఫంక్షన్ కి కచ్చితం గా తీసుకువెళ్ళండి అది వారికీ ఎంతో హెల్ప్ అవుతుంది.