NewsOrbit
న్యూస్

చైనా లీజు కింద ఒక దీవి!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) : రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఆ దీవి బ్రిటిష్ సేనలకు కమాండింగ్ సెంటర్. తర్వాత జపాన్ స్వాధీనమయింది. అనంతరం అమెరికా సేనలు భీకరమైన యుద్ధంలో ఆ దీవిని తిరిగి వశపరచుకున్నాయి. ఇంత చరిత్ర ఉన్నఈ దీవి విస్తీర్ణం 2.08 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అంత చిన్న దీవి కోసం ఇంత గొడవ ఏమిటనుకుంటున్నారా. ఆ దీవికి సహజసిద్ధంగా ఏర్పడిన డీప్‌వాటర్ పోర్టు ఉంది. అదే ఆ దీవి గిరాకీకి కారణం. అలాంటి దీవిని ఇప్పుడు చైనా 75 ఏళ్లకు లీజుకు తీసుకుంది. ఈ పరిణామంతో పాశ్చాత్య దేశాలు గతుక్కుమన్నాయి.

దక్షిణ పసిఫిక్ దేశమైన సాలమన్ దీవుల్లో తులాగి ద్వీపం ఒకటి. అమెరికా, ఆస్ట్రేలియా మధ్య  సముద్రమార్గంలో సాలమన్ దీవులు ఉన్నాయి. ఈ మధ్యనే సాలమన్ దీవుల ప్రభుత్వం తైవాన్‌కు ఇచ్చిన దౌత్య గుర్తింపును ఉపసంహరించుకుని చైనాను గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే చైనా కమ్యునిస్టు పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్న చైనా శామ్ అనే కంపెనీ తులగి దీవిని ఒక రహస్య ఒప్పందం కింద లీజుకు తీసుకుంది.

తులాగి ద్వీపంలో పెట్టుబడులు, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, కమ్యునికేషన్లు, టూరిజం అభివృద్ధి లక్ష్యంగా తులాగిని 75 సంవత్సరాలకు తీజుకు తీసుకున్నట్లు ఒప్పందం చెబుతోంది. అయితే కీలకమైన ప్రాంతంలోని తులాగీ దీవిని మిలటరీ అవసరాలకు వినియోగించుకోవడమే చైనా ఉద్దేశమని అమెరికా, ఆస్ట్రేలియా అనుమానిస్తున్నాయి. తులాగి జనాభా వెయ్యికి కాస్త ఎక్కువగా ఉంటుంది. తమ ప్రభుత్వం ఇలా మొత్తం ద్వీపాన్ని గంపగుత్తగా లీజుకు ఇచ్చారని తెలిసి అక్కడి ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

Photos Credit: The New York Times

author avatar
Siva Prasad

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Leave a Comment