వెంకటేష్ కు ‘నో’ చెప్పింది…. చిరు ని వెయిట్ చేస్తోంది..! ఈ తమిళ బ్యూటీ రేంజ్ వేరే…?

Share

తమిళనాడులో సినిమా వారిని ప్రేక్షకులు ఎంతలా మనసుకి తీసుకుంటారో అందరికీ తెలిసిందే. దేశంలో ఎక్కడా లేని విధంగా వీరు సినిమా వారిని తమ కుటుంబంలో ఒకరిగా కలిపేసుకుంటారు. రజినీకాంత్, సూర్య, అజిత్, విజయ్, కమల్ హాసన్ లాంటి నటులే కాకుండా కుష్బూ, నయనతార వంటి లేడీ సూపర్ స్టార్స్ ను కూడా వారు ఆరాధ్యదైవంగా భావిస్తారు. దీని వల్ల దేశ వ్యాప్తంగా వారికి ఉన్న క్రేజ్, రేంజ్ రెండు పెరిగిపోతాయి. 

 

నయనతారది తలైవి

ఇకపోతే ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో నయనతార కన్నా పెద్ద నటి లేదు అన్నది వాస్తవం. స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటూ…. ఆమె చేసే లేడి ఓరియెంటెడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ లుగా నిలుస్తూ తిరుగులేని జైత్రయాత కొనసాగిస్తోంది. అయితే నయనతార తెలుగులో కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. వయసు మీద పడినప్పటికీ…. ఆమె గ్లామర్ స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది. అయితే నయనతార డేట్స్ సర్దుబాటు కాకఅంతేకాకుండా ఆమె రెమ్యునరేషన్ భరించలేక తెలుగువారు ఈ మధ్య కొంచెం ఆమెకు ప్రాధాన్యతను తగ్గించారు. కానీ ఆమె అయితే ఖాళీగా ఉండట్లేదు…! తమిళంలో వరుస ప్రాజెక్టులు ఫిక్స్ చేసుకుంది. 

ఎవరికీ క్లారిటీ లేదా?

ప్రస్తుతం నయనతార విషయం ఎందుకు వచ్చింది అంటే…. ఆచార్య చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్, వేదళం చిత్రాల రీమేక్ ల లో నటిస్తున్నాడని తెలిసిందే. వీటిలో ముందుగా లూసిఫర్ షూటింగ్ మొదలవుతుంది అని ప్రకటించేశారు. ఈ చిత్రానికి రీమేక్ స్పెషలిస్ట్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. అయితే చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా ఉండాలి అనుకుంటున్న విషయం తెలిసిందే. దీనిపై ఎన్నో చర్చలు జరిగి ఆమె పేరుని ఫైనల్ చేశారు అని కూడా తెలిసిందే. ఒరిజినల్ సినిమాలో ఈ పాత్రను మంజు వారియర్ అద్భుతంగా పోషించింది. అంతేకాకుండా ఈ పాత్రకు సినిమాలో ఉండే ప్రాధాన్యత చాలా ఎక్కువ. ఇక అటువంటి పాత్రకు నయనతార అయితే సరిగ్గా ఉంటుందని భావిస్తున్నారు. అయితే దీనిని  కన్ఫర్మ్ మాత్రం ఎవరూ చేయలేకపోతున్నారు. 

గతంలోనూ అంతే….

కనీసం నిర్మాతలు కూడా  నయనతార పేరును ప్రకటించలేదు. అయితే నయనతార కి ఈ విషయం పై సమాచారం ఇచ్చినప్పటికీ చర్చలు జరిగినప్పటికీ చిరంజీవితో సినిమా వెయిటింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో కూడా వెంకటేష్ హీరోగా మారుతి దర్శకత్వంలోబాబు బంగారంచిత్రంలో నటించిన నయనతార షూటింగ్ మధ్యలో ఒక అదనపు పాట ఉంచినప్పుడు తను వచ్చి చేయలేనని…. తాను తీసుకున్న డబ్బులకిఇచ్చిన షెడ్యూలుకి సరిగ్గా సరిపోయింది అని చెప్పిందట. వెంకటేష్ వంటి నటుడికి గౌరవం ఇవ్వకుండా ఆమె ప్రవర్తించినట్లు మారుతి ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఆమె ఇలాంటి వాటిల్లో చాలా కచ్చితంగా ఉంటుందని బాగా ఇబ్బంది పెట్టిందని మారుతి చెప్పారు. 

అయితే ఇప్పుడు మెగాస్టార్ లాంటి సీనియర్ నటుడి చిత్రానికి అడిగినప్పుడు నయనతార ఇంకా ఎటువంటి మాట చెప్పక పోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది .అయితే తన ప్రియుడు దర్శకుడు విగ్నేష్ శివన్ తో ఆమె వివాహం త్వరలోనే జరగబోతోందన్న వార్తలు మాత్రం వస్తున్నాయి. ఆమె లూసిఫర్ సినిమా విషయం పై ఏ నిర్ణయం తీసుకోకపోవడానికి కారణం ఇదే కావచ్చని అంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి…! 


Share

Related posts

Singer Sunitha : భారీ ఆఫర్ దక్కించుకున్న సింగర్ సునీత… ఇందుకు ఆమె ఒప్పుకుంటుందా..?

Teja

వాలంటీర్ సజీవ దహనం!! ఎవరి ఘతూకం

Comrade CHE

కేఏ పాల్ ని రీప్లేస్ చేసిన నేత ఎవరు!

Yandamuri