CIBIL Score : బ్యాంకులు లోన్స్ జారీచేసే ముందుగా రుణ గ్రహీతలకు సంబంధించిన సిబిల్ స్కోర్ పరిశీలిస్తాయి. సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే రుణాలు వెంటనే మంజూరు చేస్తాయి. లేదంటే రుణం పొందడం దాదాపు అసాధ్యమే! అందుకే భవిష్యత్తులో లోన్ తీసుకోవాలనుకునే వారు కచ్చితంగా సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉండేటట్లు జాగ్రత్త పడాలి. అయితే సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే రుణాలు మాత్రమే కాదు ఇకపై అవి కూడా రావట. ఏంటవి? వాటితో దీనికి ఉన్న లింక్ ఏంటి? లాంటి విషయాలు ఇప్పుడు చూద్దాం.
CIBIL Score : రుణాలే కాదు ఇకపై అవి కూడా రావు…!
సిబిల్ స్కోర్ 300-900 మధ్యలో ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ స్కోర్ 750కి పైగా ఉన్నట్లయితే.. అది మంచి స్కోర్ కాబట్టి ఈజీగా లోన్స్ పొందొచ్చు. ఈ స్కోర్ పెంచాలంటే ఈఎంఐ, క్రెడిట్ కార్డు బిల్లులు సరైన సమయానికి చెల్లిస్తే సరిపోతుంది. అయితే ఇప్పుడు సివిల్ స్కోర్ తక్కువగా ఉంటే రుణాలే కాదు ఇన్సూరెన్స్ పాలసీలు కూడా తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఎందుకంటే తాజా ఆర్బీఐ రూల్స్ పరిశీలిస్తే ఫిన్‌టెక్ కంపెనీలు సైతం సిబిల్ స్కోర్‌ను యాక్సెస్ చేయడం సాధ్యమవుతుంది. ఆ విధంగా సిబిల్ స్కోర్, ఇన్సూరెన్స్ రంగం మధ్య లింక్ ఏర్పడుతోంది. ఫలితంగా ఫిన్ టెక్ కంపెనీలు సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న కస్టమర్లకు ఇన్సూరెన్స్ పాలసీని రిజెక్ట్ చేస్తున్నాయి. ఇదే కాకుండా, తక్కువ సిబిల్ స్కోర్ ఉన్న యూజర్లను డీమ్యాట్ అకౌంట్ తెరిచేందుకు స్టాక్ బ్రోకర్లు అనుమతించడం లేదు. ఇలా సిబిల్ స్కోర్ దెబ్బతింటే ఇన్సూరెన్స్ పాలసీలు పొందడంతో పాటు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కూడా అసాధ్యం అవుతుంది.
మరి స్కోరు తగ్గకుండా ఏం చేయాలి..
సిబిల్ స్కోర్ 750కి పైగా మెయింటెన్ చేయాలంటే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. అలాగే బాకీ లేకుండగా సకాలంలో ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించాలి. పర్సనల్ లోన్స్ ఎక్కువగా తీసుకోకపోవడం… క్రెడిట్ కార్డులపై ఉన్న లిమిట్‌ను పూర్తిగా వాడకపోవడం వంటివి చేయాలి. ఈ విధంగా సిబిల్ స్కోర్‌ను కాపాడుకోవచ్చు. ఇది అన్నిటికీ అనుసంధానం అవుతుంది కాబట్టి దీని విషయంలో జాగ్రత్తపడటం చాలా ముఖ్యం.
SBI News : ఎస్బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్; ఆ లిమిట్ పెంపు;!