Dancee + : డ్యాన్స్ ప్లస్ Dancee + సరికొత్త డ్యాన్స్ షో గురించి అందరికీ తెలిసిందే. ఇదివరకు జీతెలుగులో వచ్చిన ఆట ప్రోగ్రామ్ లా ప్రత్యేకంగా రూపొందించారు ఈ షోను. ఈటీవీలో ఢీ షోను మించేలా చాలా సరికొత్తగా ఈ డ్యాన్స్ షోను తీర్చిదిద్దారు. ఈ షోకు ఓంకార్ యాంకర్ గా వ్యవహరిస్తుండటంతో పాటు జడ్జిలు కూడా చాలామందే ఉన్నారు. రఘు మాస్టర్, బాబా భాస్కర్, ముమైత్ ఖాన్, మోనల్ గజ్జర్.. ఇలా చాలామంది డ్యాన్స్ ప్లస్ షోకు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.

అయితే.. ఈమధ్య ఈ షోలో కాంట్రవర్సీలు ఎక్కువవుతున్నాయి. కావాలని షో పాపులర్ అవ్వడం కోసం వివాదాలను సృష్టిస్తున్నారా? లేక నిజంగానే వివాదాలు షోలో జరుగుతున్నాయా? అనే విషయం అర్థం కావడం లేదు. ఆమధ్య స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
ముమైత్ ఖాన్ కూడా చాలాసార్లు ఈ షోలో సీరియస్ అయ్యారు. రఘు మాస్టర్ కూడా అంతే. వివాదాలకు రఘు మాస్టర్ కేరాఫ్ అడ్రస్ అవుతున్నారు.
Dancee+ : రఘుమాస్టర్ జడ్జిమెంట్ తప్పు అని తెగేసి చెప్పిన మల్లేష్
మల్లేష్ కొరియోగ్రాఫర్ కంటెస్టెంట్లు డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ చేశాక.. వెంటనే రెస్పాండ్ అయిన రఘు మాస్టర్… వీళ్ల డ్యాన్స్ ఏందిరా బాబు.. అంటూ వెంటనే రెడ్ ఇచ్చాడు. దీంతో ఆ పర్ ఫార్మెన్స్ కు కొరియోగ్రఫీ చేసిన మల్లేష్.. మీరు చెప్పినట్టు చేశాక.. ఎందుకిలా చేస్తున్నారు అంటూ రఘు మాస్టర్ పై సీరియస్ అయ్యాడు. జడ్జిమెంట్ ను ఎప్పుడూ తప్పు పట్టొద్దు అంటూ రఘు మాస్టర్ అనగా.. నాకు తప్పు అనిపిస్తే.. అది జడ్జిమెంట్ అయినా ఏదైనా డైరెక్ట్ గా చెప్పేస్త అన్న.. అంటూ రఘు మాస్టర్ కే ఎదురు జవాబు చెప్పాడు మల్లేష్. మరి.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మాత్రం ఈ శనివారం వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రోమోను చూసేయండి.