Deepti Sunaina-shanmukh: దీప్తి సునయన షణ్ముఖ్ బ్రేకప్ జరిగి నెల రోజులు గడుస్తున్నా సోషల్ మీడియాలో వార్తలు మాత్రం ఇంకా తిరుగుతూనే వున్నాయి. బిగ్ బాస్ ఇంటి నుంచి షణ్ముఖ్ బయటకు వచ్చిన వెంటనే దీప్తి అతగాడికి షాక్ ఇస్తూ బ్రేకప్ చెప్పింది. తరువాత వీరు ఎక్కడా కలిసినట్టు ఫోటోలు కూడా బయటకు రాలేదు. పైగా షన్నుని బ్లాక్ చేయడం ఇక్కడ కొసమెరుపు. ఎందుకు చేయదు మనవాడు బిగ్ బాస్ హౌస్ లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అది ప్రపంచమంతా చూసింది.
Hero Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న మహేష్ మేనల్లుడి `హీరో`.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
Deepti Sunaina-shanmukh: షన్ను కథ ఇక ముగిసినట్టేనా?
అవుననే అంటున్నారు ఓ వర్గం వారు. వారు ఇరువురు కలవడం ఇక కళ్ళే అని అనుకుంటున్నారు. కాకపోతే షన్ను తండ్రి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా అన్నారు. దీప్తి ప్రస్తుతానికి అలిగింది, అది కాస్త విరామం లాంటిదని, అలక తీరిన తరువాత మరలా షన్ను దగ్గరికి వస్తుందని ధీమా వ్యక్తం చేసాడు. దాంతో షన్ను – దీప్తి మరలా కలిస్తే బావుండును అని కొంతమంది అనుకున్నారు. కానీ అది కాస్త తామరాకుపైన నీటిబొట్టులా ఎంతో సేపు నిలవలేదు. ఇపుడు వారు ఇక కలవరనే క్లారిటీ వచ్చేసింది.
Nandamuri Balakrishna: జిల్లాల పునర్విభజన కాక…నందమూరి బాలకృష్ణ కీలక నిర్ణయం..బాలకృష్ణ కోరికను జగన్ తీరుస్తారా..
షన్ను తాను తీసిన గోతిలో తానే పడ్డాడా?
ఇటీవల తన ఇన్‌స్టా వేదికగా ‘హ్యాపీ బర్త్ డే డీ’ అని ఓ పాత ఫోటోను షేర్ చేశాడు షన్ను. కానీ ఈ విషయాన్ని దీప్తి అస్సలు పట్టించుకోలేదు. తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సెలెబ్రిటీలు పెడుతున్న విషెస్‌కు స్పందిస్తోన్న దీప్తి సునయన షన్ను పెట్టిన పోస్టులకు మాత్రం స్పందించడం లేదు. దీన్ని బట్టి దీప్తి షన్నుని ఏ రేంజ్ లో దూరం పెడుతోందో కనిపిస్తోంది. సో షన్ను సో కాల్డ్ అభిమానులారా.. మీ ఇమేజినేషన్ ని కాస్త తగ్గించుకోండి. మీ పని మీరు చూసుకోండి.