NewsOrbit
న్యూస్

టపాసులు వద్దు..! లక్ష్మి పూజ చాలు అంటున్న సీఎం ….!!

 

 

రోజు రోజుకు ఢిల్లీలో కరోనా కేసులు,వాయుకాలుష్యం పెరిగిపోతుంది. దీనితో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి నాడు టపాసులను కాల్చడం నిషేదించింది. ఢిల్లీ ప్రస్తుతం రెండు సమస్యలతో బాధపడుతుందని ఒకటి కరోనా అయితే మరొకటి వాయు కాలుష్యం అని సీఎం క్రేజీవాల్ అన్నారు. దీపావళికి టపాసులు కాల్చడం ద్వారా వాయు కాలుష్యం పెరిగే అవకాశాలు ఉన్నాయని అందుకే ప్రజలు ఎవరూ ఆ పని చేయొద్దని విజ్ఞప్తి చేసారు.

 

పండుగల సమయం కావడం, వాయు కాలుష్యం పెరగడం కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు కావడానికి కారణం అని సీఎం అన్నారు. వరుసగా రెండో రోజులలో ఢిల్లీ లో కరోనా కేసులు 6000 మార్కును దాటాయి. దీనితో కరోనా పరిస్థితి పైన చీఫ్ సెక్రటరీ,హెల్త్ అధికారులుతో సమీక్ష నిర్వహించిన సీఎం,ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా విజృంభణను నివారణ లో భాగంగా ఎక్కువ కరోనా పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం ప్రణాళిక చేసింది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య మౌలిక సదుపాయాలు, ఆక్సిజన్ మరియు ఐసియు పడకలను పెంచుతున్నాము, మరణాల రేటు పెరగకుండా చూసుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది అన్ని కేజ్రీవాల్ ట్విట్టర్లో తెలిపారు.

గతేడాది టపాసులు కాల్చకుండానే దీపావళి జరుపుకొన్నామని, అదే విధంగా ఈసారి కూడా జరుపుకోవాలన్నారు. వాయు కాలుష్యం, కరోనా వైరస్‌ నేపథ్యంలో టపాసులు కాల్చడం పిల్లల ఆరోగ్యానికి హానిచేస్తుందని హెచ్చరించారు. పొగ కారణంగా ఢిల్లీలో మరణాలు సంభవించడం ఇదే ఆఖరు ఏడాది కావాలని ఆకాంక్షించారు. ఇప్పటికే కాలుష్యంతో ఢిల్లీ అల్లాడుతోందని అందుకే టపాసులు కాల్చవద్దని,      తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈసారి లక్ష్మీపూజ నిర్వహిస్తామని, అందరం కలిసి దీపావళి జరుపుకొందామంటూ పిలుపునిచ్చారు. ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. దీపావళి (నవంబర్‌ 14) రోజున రాత్రి 7.39 గంటలకు రెండు కోట్ల మంది ఢిల్లీ ప్రజలంతా తమ ఇళ్లల్లో టీవీల్లో ప్రత్యక్ష ప్రసారమయ్యే లక్ష్మీ పూజ కార్యక్రమాన్ని వీక్షించాలని, తమ కుటుంబ సభ్యులతో కలిసి పూజల్లో పాల్గొనాలని కోరారు.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju