న్యూస్

Gaggery: ఆ ప్రాంతంలో బెల్లం కొనాలంటే ఆధార్ తప్పని సరి ఎందుకో తెలుసా ..!

Share

Gaggery: మీరు పది కిలోల కంటే ఎక్కువ బెల్లం కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తప్పనిసరి. అదేంటి బెల్లం కొనుగోలుకు ఆధార్ కార్డు అనుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. నాటుసారాను పోలీసులు ఎంతగా అరికడుతున్నా.. ఇంకా ఎక్కడో ఒక దగ్గర నాటుసారా దందా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతూనే ఉంది. దీంతో నెల్లూరు పోలీసులు ఓ నిర్ణయం తీసుకున్నారు. నాటుసారాకు ముఖ్యంగా అవసరమైన బెల్లాన్ని పది కేజీలకు మించి కొనుగోలు చేస్తే ఆధార్, ఫోన్ నెంబర్ తప్పనిసరి అని సూచించారు.

Gaggery: పూర్తీ వివరాలు..!

వివరాల్లోకి వెళ్తే.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలోని రేబాలవారి వీధిలోని సింహపురి వాణిజ్య మండలిలో బెల్లం హోల్‌సేల్‌ విక్రయదారులతో సెబ్‌ నెల్లూరు-1, 2, నవాబుపేట పోలీసులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈఎస్‌ మాట్లాడుతూ… నాటుసారా వలన కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని నాటుసారా తయారీదారులకు బెల్లం సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నాటుసారా తయారీ, విక్రయాలు, అక్రమ రవాణా కట్టడే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని, ఇందుకు వ్యాపారులు సహకరించాలని కోరారు.

నాటుసారా తయారీదారులు బెల్లం కొనుగోలుకు వస్తే తమకు తెలియజేయాలని సూచించారు. నాటుసారా రహిత జిల్లాగా నెల్లూరును తీర్చిదిద్దేందుకు వ్యాపారులు తమ వంతు సహాయ, సహకారాలు అందించాలని కోరారు. పది కేజీలు మించి బెల్లం కొనుగోలు చేస్తే వారి ఆధార్‌, ఫోను నంబరు తీసుకుని ఆ వివరాలను ప్రతినెల నాలుగో తేదీలోగా సెబ్‌ నెల్లూరు-1 స్టేషన్‌లో అందజేయాలనని సెబ్‌ ఏఈఎస్‌ ఎస్‌.కృష్ణకిషోర్‌రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో సెబ్‌ నెల్లూరు-1, 2, జేడీ టీం ఇన్‌స్పెక్టర్లు కేపీ కిషోర్‌, వెంకటేశ్వరరావు, హుస్సేన్‌ బాషా, నవాబుపేట ఇన్‌స్పెక్టర్‌ టీవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


Share

Related posts

అయోధ్య కేసులో 4గురికి జీవిత ఖైదు

somaraju sharma

టీఆర్ఎస్ కు వ్య‌తిరేక గాలి … కేసీఆర్ స‌ర్వేలో సంచ‌ల‌న నిజం ?

sridhar

Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య.. మిస్సమ్మ నాలుగో ఎపిసోడ్ వచ్చేసింది?

Varun G
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar