NewsOrbit
న్యూస్ హెల్త్

బాబోయ్.. మిర్చీ ఎక్కువగా తింటే అంతా కాలం బ్రతుకుతారా?

ఎండుమిర్చి.. అన‌గానే హాట్ హాట్ ఘాటు, కారం గుర్తుకొస్తాయి. అయితే, వీటిని ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల క‌డుపులో అల్స‌ర్లు, ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని వైద్యులు హెచ్చిరిస్తుంటారు. చాలా మందికి ఘాటు హాటు కారంతో వండిన ఆహార ప‌ద‌ర్థాలు తినాల‌ని కోరిక ఉన్నా.. వైద్యుల హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో వాటికి దూరంగా ఉంటారు. మ‌రి కొంద‌రైతే అవేవీ ప‌ట్టించుకోకుండా వాటిని ఆస్వాదిస్తుంటారు. ఈ నేప‌థ్యంలోనే అమెరికాకు చెందిన ప‌రిశోధ‌కులు ఎండు మిర‌ప‌కాయ‌ల‌కు సంబంధించి ప‌లు ఆసక్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు.

ఆ విష‌యాలు వింటే అయ్య బాబోయ్ ఎండు మిర‌ప‌కాయ‌లు ఇంత ప‌ని చేస్తాయా? అరే మ‌నం ఇన్ని రోజులు మిస్స‌య్యామే అనుకుంటారు. అదేంటి అనుకుంటున్నారా? ఎండు మిర్చి తిన‌డం వ‌ల్ల స‌మ‌స్య‌లు రావ‌డం గురించి ప‌క్క‌న బెడితే.. .దాని తిన‌డం వ‌ల్ల అనేక ర‌కాల లాభాలు ఉన్నాయ‌ని అమెరికాకు చెందిన ఓ ప‌రిశోధ‌న బృందం వెల్ల‌డించింది. మ‌రీ ముఖ్యంగా అకాల మ‌ర‌ణం, గుండె సంబంధ వ్యాధులు, ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు, క్యాన్స‌ర్ వంటి రోగాలు ద‌రిచేరే అవ‌కాశం చాలా త‌క్కువ‌గా ఉంటుంద‌ని పేర్కొంది. అలాగే, ఆయుష్షును సైతం పెంచుతుంద‌ని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ అధ్యయనం వెల్ల‌డించింది.

ఘాటు, కారం క‌లిగిన ఈ మిర‌ప‌కాయ‌లను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల చాలా ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని తెలిపింది. శ‌రీరంలో ఏర్ప‌డే క‌ణిత‌ల‌ను అడ్డుకోవ‌డంతో పాటు ర‌క్తంలో గ్లూజోజ్ స్థాయిల‌ను నియంత్ర‌ణ‌లో ఉంచి, మెరుగైన ర‌క్త ప్ర‌స‌ర‌ణ‌కు తోడ్ప‌డుతుంద‌ని తెలిపింది. క్యాన్స‌ర్‌ వ్యాధుల‌ను అడ్డుకునే నిరోధ‌కాలు సైతం భారీగా పెరుగుతాయ‌ని వివ‌రించింది. ఆయా ఆరోగ్య సమ‌స్య‌ల‌ను దాదాపు 25 శాతం వ‌ర‌కూ త‌గ్గిస్తుంద‌ని త‌మ అధ్య‌య‌నంలో వెల్ల‌డైంద‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు. ఘాటు, కారం ఎక్కువ‌గా ఉండే ఎండు మిర‌ప‌కాయ‌ల‌ను సైతం ఆహారంగా తీసుకోవ‌డం మంచిదేన‌ని సూచించారు.

అమెరికా, చైనా, ఇట‌లీ వంటి దేశాల‌కు చెందిన దాదాపు 5.70,000 మందికి పైగా ప్ర‌జ‌ల‌పై తాము వారు తీసుకునే ఆహారం. ఆరోగ్యం, ఇత‌ర సమ‌స్య‌లు వంటి అంశాల‌పై జ‌రిపిన ప‌రిశోధ‌న‌లో ఈ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయ‌ని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ పరిశోధకుడు కార్డియాలజిస్ట్ బోజు చెప్పారు. ఈ ఫ‌లితాలు మ‌రిన్ని ప్ర‌యోగాల‌కు బాస‌ట‌గా నిలుస్తాయ‌ని యూఎస్ హార్ట్ అసోసియేషన్, పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీకి చెందిన పోషకాహార నిపుణుడు పెన్నీ క్రిస్-ఈథర్టన్ అన్నారు. మ‌ర‌ణం ముప్పును త‌గ్గించ‌డంలోనే కాదు శ‌రీరంలోని కొవ్వును త‌గ్గించ‌డం, ఇత‌ర నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగించ‌డంలో ఉప‌యోగ‌ప‌డుతోంది. జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరును సైతం ఎండు మిర్చి మెరుగుప‌రుస్తుంది.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju