జాతీయం న్యూస్

Rajya Sabha Elections: 57 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Share

Rajya Sabha Elections: ఏపి, తెలంగాణతో సహా 15 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 57 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు షెడ్యుల్ విడుదల చేసింది. ఎన్నికలకు సంబంధించి ఈ నెల 24వ తేదీన నోటిఫికేషన్ జారీ కానున్నది. జూన్ 10న పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది.  ఏపిలో నాలుగు, తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, యుపిలో అత్యధికంగా 11 సీట్లలో, ఆ తర్వాత మహారాష్ట్ర, తమిళనాడులో ఆరేసి రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Elections 57 Rajya Sabha Seats june 10th

Elections 57 Rajya Sabha Seats june 10th

ఏపిలో సురేష్ ప్రభు, టీజీ వెంకటేశ్, సుజనా చౌదరి, విజయసాయిరెడ్డి పదవీ కాలం జూన్ 24వ తేదీతో ముగియనుండగా, తెలంగాణలో కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి శ్రీనివాస్ ల పదవీ కాలం జూన్ 29 తేదీతో ముగియనుంది. చత్తీస్‌గడ్ లో రెండు, మధ్యప్రదేశ్ మూడు, కర్ణాటక నాలుగు, ఒడిశా మూడు, పంజాబ్ రెండు, రాజస్థాన్ నాలుగు, ఉత్తరాఖండ్ ఒకటి, బీహార్ అయిదు, హర్యానా రెండు, జార్ఖండ్ రెండు స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Rajya Sabha Elections: షెడ్యుల్ వివరాలు ఇవి

  • నోటిఫికేషన్ జారీ:  మే 24
  • నామినేషన్ల స్వీకరణ తుది గడువు:  మే 31
  • నామినేషన్ల పరిశీలన:  జూన్ 1
  • నామినేషన్ల ఉపసంహరణ తది గడువు:  జూన్ 3
  • పోలింగ్ తేదీ: జూన్ 10 (ఉదయం 9గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు) అదే రోజు సాయంత్రం 5 గంటల నుండి ఓల్ల లెక్కింపు


Share

Related posts

జ‌గ‌న్ కొత్త గేమ్ … అచ్చెన్నాయుడు బుక్క‌యిపోతున్నారా?

sridhar

సింహాన్ని కొట్టి, పిడిగుద్దులు గుద్ది భయపెట్టాడు..! వామ్మో బీభత్సమైన న్యూస్ ఇది..!!

bharani jella

Telangana Politics: తెలంగాణ పాలిటిక్స్ బాంబ్..! టిఆర్ఎస్ నుండి 35 మంది జంప్..!?

Srinivas Manem
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar