F 3 : ఎఫ్ 3 రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు చిత్ర బృందం. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ సినిమా ఎఫ్ 3. పటాస్ నుంచి వరుస సక్సస్ లతో ఫమంచి ఫాం లో ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 2015లో దర్శకుడుగా కెరీర్ మొదలు పెట్టిన అనిల్ రావిపూడి ప్రతీ సినిమాని స్టార్ హీరో తో చేస్తూ భారీ సక్సస్ లు ఇస్తూ వస్తున్నాడు. ఇండస్ట్రీలో రాజమౌళి .. కొరటాల శివ తో పాటుగా సక్సస్ బాటలో సాగుతున్నాడు అనిల్ రావిపూడి.
అందుకే అనిల్ రావిపూడి తో సినిమా చేసేందుకు స్టార్ హీరోలందరూ ఆతృతగా ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరూ తీసి ఇండస్ట్రీలో మరిఓ లెవల్ కి చేరుకున్నాడు. అనిల్ రావిపూడి మాస్ .. క్లాస్ అన్న తేడా లేకుండా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ని తీస్యూ స్టార్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. కాగా అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్2 సీక్వెల్ ఎఫ్3 సినిమాని రూపొందిస్తున్నాడు.
F 3 : సోలో రిలీజ్ డేట్ తో వచ్చేందుకు రెడీ అవుతోంది ఎఫ్ 3.
2019లో వచ్చిన ‘ఎఫ్2’ లో నటించిన విక్టరీ వెంకటేష్ – వరుణ్ తేజ్ – తమన్నా – మెహరీన్ లే… ఈ ఎఫ్ 3 లో కూడా నటిస్తున్నారు. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఈ సారి మూడింతలు ఉండేలా తెరకెక్కిస్తున్నాడు అనిల్ రావిపూడి. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. కాగా ఈ ఏడాది ఆగష్టు 27న ఎఫ్3 సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు దిల్ రాజు బృందం. ఈ అప్డేట్ వచ్చినప్పటి నుంచి అటు వెంకీ వరుణ్ ఫ్యాన్స్ ఇటి మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే ఆగస్టులో రిలీజ్ డేట్ లాక్ చేసిన ఈ సినిమా కి పోటీ అయితే ఇప్పటి వరకు లేదంటున్నారు. సోలో రిలీజ్ డేట్ తో వచ్చేందుకు రెడీ అవుతోంది ఎఫ్ 3.